📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Jagan Mohan Reddy: నేడు బెంగళూరుకు వెళ్లనున్న జగన్

Author Icon By Sharanya
Updated: May 8, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానాల తరువాత పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే లక్ష్యంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

సమావేశంలో హాజరు కానున్న పలు కీలక నేతలు

ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలాల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, తదితర ప్రజాప్రతినిధులతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఇటీవల చోటుచేసుకున్న అవిశ్వాస తీర్మానాలు, అధికార పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చ జరగనుంది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపర్చే విధానాలు, నాయకత్వ మార్పులు, ప్రాదేశిక సమీకరణాలు వంటి కీలక అంశాలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదే సమయంలో పార్టీలో చిత్తశుద్ధితో పని చేస్తున్న నేతలకు మద్దతు, మార్గదర్షనాలు ఇవ్వడంతో పాటు, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి సంబంధించి కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశం అనంతరం, జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 5:40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, 8:00 గంటలకి బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read also: Andhra Pradesh: నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే: జగన్

#APPolitics #BangaloreVisit #BengaluruMeetings #CMJagan #JaganMohanReddy #YSRCP Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.