ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు, జగన్ (Jagan) మధ్య తేడా స్పష్టమే. ఒకరు ప్రజాస్వామ్యాన్ని సాధనంగా చూస్తే, మరొకరు స్వార్థం కోసం దుర్వినియోగం చేశారు.చంద్రబాబు (Chandrababu) ప్రజల తీర్పును గౌరవిస్తారు. ఓడినా శిరసు వంచుతారు. ఇది పెద్ద మనసు గల నాయకుడి లక్షణం.జగన్ ఓటమి తర్వాత ప్రజలపై ఆగ్రహంగా మారారు. ఓటరు హక్కును వినియోగించిన వారినే వెన్నుపోటుదారులుగా చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి భిన్నం.ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వాజ్‌పేయిలు ఓడినా ప్రశాంతంగా ఉన్నారు. కానీ జగన్ మాత్రం ప్రతి రోజు ప్రతీకార ధోరణితో ప్రసంగిస్తున్నారు.
ఆరోగ్య రంగం వైఫల్యానికి నిదర్శనం
ఆయన హయాంలో ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతింది. రూ.8,400 కోట్లు ఖర్చు చెస్తానన్న వైద్య కళాశాలలపై కేవలం 14 శాతం మాత్రమే ఖర్చు చేశారు.ఆరోగ్య నాడు–నేడు కోసం రూ.12,000 కోట్లు ప్రకటించారు. కానీ కేవలం 17 శాతం మాత్రమే వినియోగించారు. ప్రజల డబ్బును గాలికొదిలేశారు.వైద్య పోస్టుల నియామకాలు వైసీపీ నేతల ఇళ్ల నుంచి వచ్చాయి. అనుమతిలేకుండా వందలాది మంది డాక్టర్లు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ వైద్యం మరింత క్షీణించింది.
గౌరవంగా నడుస్తున్న కూటమి
ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిస్థితిని మార్చేందుకు కృషి చేస్తోంది. చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వానికి ప్రజలు మహానాయకులు. ప్రజలపై నింద వేయడం మాకు వద్దు. ప్రజల కోసమే సేవ చేస్తాం.
Read Also : AP Development : పాలనకు ఏడాది.. మార్పు దిశగా అడుగులు