📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Jagan: హైకోర్టు ఆదేశాలపై జగన్ హర్షం

Author Icon By Pooja
Updated: September 27, 2025 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారాన్ని సీబీఐకి బదిలీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వాగతించారు. హైకోర్టు (High Court)స్వయంగా (సుమోటో) తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి దారితీసే అడుగని పేర్కొన్నారు. ‘సత్యమేవ జయతే’ హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ఈ తీర్పు న్యాయానికి గెలుపు అని అభివర్ణించారు.

Read Also: Indrakeeladri: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ

జగన్ తన ట్వీట్‌లో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో చట్టపరమైన ఉల్లంఘనలు విస్తృతమైపోయాయని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ కూడా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలను ప్రశ్నించే హక్కు లేకుండా అక్రమ కేసులు, అరెస్టులు సాధారణమైపోయాయని, సెక్షన్ 111ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు దోహదం చేస్తాయని ఆయన అన్నారు.

కేసు నేపథ్యం

తాడేపల్లిలో నివసించే సవీంద్ర రెడ్డిని పోలీసులు అక్రమంగా(Illegally) అదుపులోకి తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అనంతరం పాత కేసులో మళ్లీ అరెస్ట్ చూపించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సీబీఐ ప్రాథమిక నివేదికను సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 13కి వాయిదా వేసింది.

సవీంద్ర రెడ్డి కేసును సీబీఐకి ఎందుకు అప్పగించారు?
పోలీసులు అక్రమ నిర్బంధం చేసి, తప్పుడు పత్రాలతో అరెస్ట్ చూపించారని ఆరోపణలపై హైకోర్టు సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి బదిలీ చేసింది.

జగన్ ఎలా స్పందించారు?
హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు దోహదం చేస్తుందని, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో న్యాయ వ్యవస్థ అణచివేతకు గురవుతోందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh High Court Breaking News in Telugu cbi investigation Google News in Telugu Jagan Mohan Reddy Savindra Reddy Arrest Case Telugu News Today YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.