📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP CM : చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

Author Icon By Sudheer
Updated: March 9, 2026 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP CM: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన “డ్రామాలు”గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా ఆర్థికంగా మహిళలను ఆదుకుంటామని చెప్పిన పథకాలు అటకెక్కాయని, ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తన సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

Read Also : T20 World Cup: సంబరాల్లో భారత్

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై జగన్ మరింత ఘాటుగా స్పందించారు. ‘అత్యాచార ఆంధ్రప్రదేశ్’గా రాష్ట్రాన్ని మారుస్తున్నారంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పాలక పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, టీటీడీ చైర్మన్ వంటి కీలక పదవుల్లో ఉన్నవారు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ.. నేరగాళ్లను కఠినంగా శిక్షించాల్సింది పోయి, వారిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక అర్హత ముఖ్యమంత్రికి లేదని, మహిళల భద్రతను గాలికొదిలేసి పగటి వేషగాళ్లలా నటిస్తున్నారని ఆయన ఈ కథనంలో పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Ap AP cm Chandrababu Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.