YS Jagan Padayatra : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2029 ఎన్నికలే లక్ష్యంగా మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. ‘పాదయాత్ర 2.0’ పేరుతో వచ్చే ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యే ఉండి రాష్ట్రవ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర పూర్తిగా పార్టీ కార్యకర్తల కేంద్రంగా సాగుతుందని, వైసీపీని మళ్లీ బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని జగన్ పేర్కొన్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో (YS Jagan Padayatra) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన జగన్, తన రాజకీయ ప్రయాణంలో మార్పులు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. గతంలో పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కార్యకర్తలకు తగిన సమయం ఇవ్వలేకపోయానని అంగీకరించారు. ఇకపై గ్రామ స్థాయి నుంచే కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.
Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?
2024 ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావడమే లక్ష్యంగా ‘జగన్ 2.0’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని, వారి ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతామని అన్నారు. చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తూ, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పాదయాత్ర 2.0లో మూడు రోజులకు ఒకసారి భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం వరకు సాగేలా ప్రణాళిక రూపొందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించిందన్న నమ్మకంతోనే ఈ కొత్త వ్యూహానికి జగన్ శ్రీకారం చుట్టినట్లు నేతలు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: