Jaahnavi Kandula: అమెరికాలో(USA) ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడ ఓ పోలీస్ అధికారి నిర్లక్ష్యానికి బలైన తెలుగుమ్మాయి జాహ్నవికి సియాటెల్ ప్రభుత్వం 29 మిలియన్ డాలర్లు పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి ప్రభుత్వం పరిహారం ప్రకటించే రెండు రోజుల ముందే జాహ్నవి తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో కన్నుమూశారు. అటు జాహ్నవిని కోల్పోయి, ఇటు ఇంటి పెద్ద శ్రీకాంత్‌ను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. ఈ పరిహారాన్ని మేం ఏం చేసుకుంటాం అంటూ ఆవేదనలో ఉంది. అయితే సియోటల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన తర్వాత పరిణామాలపై జాహ్నవి బంధువు భవసాగర్ పేరుతో ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ కుటుంబం పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు.
Read Also: Corruption : అవినీతికి తెరపడేదెప్పటికి?
జాహ్నవి కందుల కుటుంబ పరిస్థితి
జాహ్నవి చనిపోయిన దగ్గర నుంచి ఆమె మృతదేహాన్ని ఇండియా వచ్చే వరకు, ఆ తర్వాత అక్కడ లీగల్ ఫైట్, ఆందోళనలు అన్ని ఆ యూనివర్సిటీ అండ్ ఫ్రెండ్స్ చూశారు. అందుకే వచ్చే అమౌంట్‌లో (పరిహారం) మేజర్ కాంట్రిబ్యూషన్ (ఎక్కువ శాతం) ఆ యూనివర్సిటీకి (నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ) డొనేట్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే తాను ఆంధ్రాలో చదివిన కాలేజీకి కూడా వాళ్లు డబ్బు మనుషులు కాదు అని చెప్పడానికే నేను ఈ పోస్ట్ వేస్తున్నా ఆయన పోలీస్‌గా పులివెందులలో కూడా వర్క్ చేశారు ఇంకా రాయలసీమలో చాలా ప్లేసెస్‌లో వర్క్ చేశారు అక్కడ అడగండి ఆయన కేరక్టర్ తెలుస్తుంది అంటూ భవసాగర్ ట్వీట్ చేశారు.
జాహ్నవి వాళ్లు మా చుట్టాలు, నాకు కూతురు వరుస అవుతుంది. రెండేళ్లు అయ్యింది ఒక్కరు కూడా వాళ్ల బాధని చూసింది లేదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ల పరిస్థితి ఎలా ఉంది అంటే మాకు డబ్బు వద్దు ఏమి వద్దు అనే స్టేజ్‌కు తీసుకెళ్లారు ఆ ఫాదర్ (జాహ్నవి వాళ్ల నాన్న) మొన్న ఫిబ్రవరి 10thన చనిపోయారు. కేవలం కూతురు మరణం తట్టుకోలేకే ఆ బెంగతోనే హార్ట్ ఎటాక్ తెచ్చుకున్నారు, ఈ డబ్బు న్యూస్ తెలిశాక మీడియా వాళ్ళు ఇంటర్వ్యూస్ కోసం, బ్యాంకు వాళ్లు మా బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడండి అంటూ ఒక పక్క తండ్రి చనిపోయి ఉంటే అసలు మా కులం కాకపోయినా ఎమ్మెల్యే వచ్చి వాళ్ళబ్బాయికి చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతున్నాడు. సినిమాల్లో చూపిస్తే ఏదో అనుకున్న కానీ లైవ్ లో చూస్తున వింతలు అన్ని’ అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: