📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Irrigation Management: సాగునీటి నియంత్రణలో రైతుల పాత్ర పెంపు

Author Icon By Pooja
Updated: October 4, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : సాగు నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో రాష్ట్రంలో సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించకపోయినా సాగునీటి సంఘంలో పాగావేద్దామని కలలు కంటున్నారు. సాగునీటి సంఘాలపై గురిపెట్టి కొంత మంది వ్యవసాయం వృత్తి కలిగిన రాజకీయనాయకలు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా 1997లో నీటి సంఘాలను ఏర్పాటు చేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10748 సాగునీటి సంఘాలు ఉండగా అందులో తెలంగాణాలోనే 4690 సాగునీటి సంఘాలు(Irrigation associations) అంటే 43.6శాతం ఉన్నాయి.

Read Also: Heavy Rains:గోదావరి ఉప్పొంగు, కృష్ణమ్మ ఉధృతి

అందులో మేజర్ సాగునీటి సంఘాలు 601కాగా, మధ్యతరహా సాగునీటి సంఘాలు 166, మైనర్ ఇరిగేషన్లో 3923 సాగునీటి సంఘాలు ఉన్నాయి. రాయలసీమలో 245 మేజర్ సాగునీటి సంఘాలు కాగా ఆంధ్ర ప్రాంతంలో 1405 మేజర్ సాగునీటి సంఘాలు ఉండేవి. 2008 సర్వే ప్రమాణికంగా మూడు ప్రాంతాలు కలిపి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ సాగునీటి సంఘాలు 2261 ఉన్నాయి. మీడియంలో రాయలసీమలో 62 సాగునీటి సంఘాలు ఉంటే ఆంధ్రప్రాంతంలో 182 ఉండేవి, మూడు ప్రాంతాలు కలిపి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 410 మధ్యతరహాప్రాజెక్టులు ఉండేవి. మైనస్ఇరిగేషన్ సాగునీటి సంఘాలు 8077 మొత్తం రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రాంతంలో 2905, రాయలసీమలో 1252 మాత్రమే ఉండేవి.

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత వీటిని ఏర్పాటు చేస్తామని, కన్వీనర్లుగా నీటి పారుదల శాఖ అధికారులు వ్యవహరిస్తారని ఇటీవల మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సంఘాలకే వారి మండలం, గ్రామాల్లో చెరువులు, కుంటలు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను అప్పగించనుండటంతో పలువురు చిన్న స్థాయి నాయకులు వీటిపై దృష్టిసారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి పారుదల వ్యవస్థల నిర్వహణ చట్టం -1997 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మైలురాయి లాంటిది.

నీటిపారుదల నిర్వహణలో రైతులను భాగస్వామ్యం చేయడంతోపాటు ప్రభుత్వం తరహాలో వాటిని నియంత్రణను చేయడానికి నీటి వినియోగదారులైన రైతులను బలోపేతం చేయడానికి నీటివనరుల సమర్థవంతంగా నిర్వహించడం సమాన స్థాయిలో పంపిణీ చేసుకోవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టింది. మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది, నీటిపారుదల వ్యవస్థలను నిర్వహించడానికి, నిర్వహించడానికి డిస్ట్రిబ్యూటరీ కమిటీలు(Distributory Committees), ప్రాజెక్ట్ కమిటీలతో పాటు చిన్న కాలువ స్థాయిలో స్వతంత్ర నీటి వినియోగదారుల సంఘాలను సృష్టించింది. నీటిపారుదల శాఖ పర్యవేక్షణలో ఆయా చెరువులు, ప్రాజెక్టుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు.

మూడేళ్ల కాలపరిమితితో వీటి చైర్మన్ ల పదవీ కాలాన్ని కొనసాగించారు. తెలంగాణలో నాలుగువేల వరకునీటి సంఘాలు ఉండేవి. ఇప్పుడు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 2012లో ఈ సంఘాలను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి అనేక గ్రామాల్లో చెరువులు, కుంటల శిఖం భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కొందరు రెవెన్యూ, అధికారుల అండదండలతో పట్టాలు కూడా చేసుకున్నారు. పంట కాల్వల మరమ్మతులు. చెరువులకు పడిన గండ్లు పూడ్చకపోవడంతో రైతులకు సాగునీటి సమస్య ఎదురవుతోంది. ప్రభుత్వ నిధులతో నిర్వహించే పనుల్లో రైతుల భాగస్వామ్యం, పర్యవేక్షణ లేకపోవడంతో అధికారులు తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Agricultural Policy Farmers Participation Google News in Telugu irrigation department telangana government Telugu News Today uttam kumar reddy Water User Associations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.