📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Part-time faculty: పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు?

Author Icon By Sudha
Updated: January 1, 2026 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒయూ అంటేనే అనేక సామాజిక ఉద్యమాలకు పురిటి గడ్డ. వందేమాతర ఉద్యమం నుండి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు సాగిన మలిదశ ఉద్యమానికి సారధి. ఇక్కడ చదివే విద్యార్థుల్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన వారే. రాష్ట్రంలోని నలుమూలల నుండి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వస్తుంటారు. అటువంటి యూనివర్సిటీల్లో అధ్యా పక పోస్టులు భర్తీ చేయక పుష్కర కాలం దాటింది. దాదాపు 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో నియామకాలు ఉంటాయన్న వార్తలు నిత్యకృత్యం అయ్యాయి. కానీ కార్య రూపం దాల్చడం లేదు. ఇటీవలే ఉస్మానియాయూనివర్సి టీలో పార్ట్ టైమ్ అధ్యాపకుల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో విధి విధానాలపై స్పష్టత లేదు. ఏదో నోటిఫికేషన్ ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఉంది. సిలబస్ లేకుండా పరీక్షల్ని నిర్వహించారు. సబ్జెక్టుల వారీగా నిర్వ హించిన పరీక్షల్లో అభ్యర్థికి వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా,హాజరైన ప్రతి ఒక్కర్ని ఇంటర్వ్యూకు పిలవడం జరిగింది. అసలు పెట్టిన పరీక్షకు ఎన్ని మార్కులు కేటా యించారు.? పీజీ, పీహెచ్ఐతో పాటు నెట్, సెట్ లాంటి వాటికి ఎన్ని మార్కులను కేటాయించారో స్పష్టత లేదు. వాస్తవానికి యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టుల్ని యూ జీసీ నియమ, నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సి ఉం టుంది. కానీ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.

Read Also: http://Numaish2026: గురువారం ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన

Part-time faculty

కుల, మతాలకు అతీతంగా

చాలా డిపార్ట్మెంట్లల్లో పీహెచ్ఐ పూర్తి చేసి నెట్/ సెట్ వంటి వాటి లో అర్హత సాధించిన వారికి కాకుండా సామాజిక సమీకర ణల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఉందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఒయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పలు హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని దాన్ని కాపాడుకోవాలని చెప్తూ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల్ని మంజూరు చేస్తూ జీవోను కూడా విడుదల చేశారు. దీంతో పాటు నియామకాల్ని బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, కుల, మతాలకు అతీతంగా చేపట్టాలని తెలిపారు. రెగ్యులర్ పోస్టులు దేవుడెరుగు.. కనీసం పార్ట్ టైమ్అధ్యాపకుల (Part-time faculty)నియామకాల్ని కూడా కుల, మత, వర్గ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారంటే ముఖ్యమంత్రిమాటలకు తను నమ్మిన యూనివర్సిటీ అధికారులు ఇచ్చే విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తీకి జీవో నం.21 తీసుకు వచ్చింది. ఈ జీవోలో వంద మార్కులకు గాను డిగ్రీ, పీజీ లతోపాటు పీహెచ్ఐకి కూడా మార్కుల్ని కేటాయించారు. వివిధ సబ్జెక్టుల్లో జాతీయ స్థాయిలో నెట్ ఉత్తీర్ణతకు, రాష్ట్ర స్థాయిలో సెట్ ఉత్తీర్ణతకు కూడా మార్కుల్ని కేటాయించారు.

ఏళ్ల తరబడి ఎదురు చూపులు

వాస్తవానికి దేశవ్యాప్తంగా నిర్వహించే నెట్లో ఉత్తీర్ణత సాధించడం, రాష్ట్రస్థాయిలో నిర్వహించే సెట్తో పోల్చితే కొంత కఠినంగా ఉంటుంది. కనీసం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ జీవో 21 ప్రకారం పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాల భర్తీ చేయకపోవడం శోచనీయం. నియామకా లు పారదర్శకంగా, పోటీ ఆధారంగా జరగాలి. ఇలా జరగ కుంటే యూజీసీ నిబంధనల ప్రకారం నెట్/సెట్, పీహెచ్ వంటి అర్హతలు సాధించిన అభ్యర్థులకు అవకాశాలులేకుండా పోతాయి. తెలంగాణలో వేలాది మంది అభ్యర్థులు జేఆర్ ఎఫ్, నెట్ ఉత్తీర్ణతతో పాటు పీహెచ్ పూర్తి చేసిఅధ్యాపక ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. వారికి కాదని ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న వారు మా కులంవాడని, మా మతం వాడని, మాప్రాంతం వాడని, లేదా మా భావ జాలం వాడని ఇష్టం వచ్చినట్టు అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేస్తే ఇక మెరిట్ సాధించిన వారి పరిస్థితి? ఇది ఇలా ఉంటేప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకుల భర్తీ కోసం తీసుకువచ్చిన జీవో 21లో కొన్ని మార్పులు చేయాలని ఉద్యోగార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారిసూచ నలకు సానుకూలంగా స్పందించి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తే వేలాది మంది అభ్యర్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణ యూనివర్సి టీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే, అత్యుత్తమ ప్రతిభావంతులైన అధ్యాపకులను భర్తీ చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రభుత్వ యూనివర్సిటీలు రాజకీయ నిరుద్యోగ పునరావాస కేంద్రాలుగా మిగిలే ప్రమాదంఉంది.

Part-time faculty

మౌలిక సూత్రాలకు లోబడి

ఇంతవరకు అన్ని వర్సిటీల్లో పూర్తి స్థాయి పాలక మండళ్లు కొలువుతీరలేదు. అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలు కాకుండా 450 అధ్యాపకుల పోస్టుల్ని మాత్రమే భర్తీ చేస్తారని పలు పత్రికల్లో వార్తలు వస్తున్నా యి అది కూడా కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులను(Part-time faculty)మిన హాయించి అంటే ఇక నిరుద్యోగులకు మిగిలే పోస్టులు ఎన్ని? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఖాళీలను గుర్తించి పూర్తి స్థాయిలో యూనివర్సిటీ అధ్యాపకుల్ని భర్తీ చేసినప్పుడే బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను అందించినట్లు అవుతుంది. కేంద్రం, యూజీసీ నుండి రావాల్సిన నిధులు కూడా సకాలంలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా యూనివర్సిటీల్లో ఆచార్యుల నియామకాలు చేప ట్టాలన్న నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేయాలి. అదేవిధంగా ఇటీవల జరిగిన పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరి గాయన్న అంశంపై యూనివర్సిటీ అధికారులు స్పందించి అర్హులైన ఉద్యోగార్థులకు న్యాయం చేయాలి.
-యం. అర్జున్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Academic jobs Breaking News Education News Faculty recruitment latest news Part-time faculty Recruitment irregularities Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.