📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran War: ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

Author Icon By Vanipushpa
Updated: March 17, 2026 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై పడింది. ఇది కేవలం చమురు దిగుమతులపైనే కాకుండా, భారత్ నుంచి ఆయా దేశాలకు జరిగే ఎగుమతులపైనా పడింది. అలా ప్రభావితమైన వారిలో రాయలసీమ అరటి రైతులు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు సముద్రమార్గంలో ఎగుమతయ్యే జీ9 రకం అరటి సాగుచేస్తున్న వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ అరటి(Banana) రకమే ఎందుకు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది, యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోయి రైతులు త్రీవ నష్టాలకు గురి అవుతున్నారు.

Read Also: Attack : అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

Iran war..a huge blow to Rayalaseema banana farmers

గ్రాండ్ 9 అరటి ఎందుకంత ప్రత్యేకం..

ఆంధ్రప్రదేశ్‌లో‌ని చాలా ప్రాంతాల్లో అరటి సాగు చేస్తున్నా అనంతపురం, కడప, నంద్యాల జిల్లాలలో పండే అరటి మాత్రమే ఎగుమతికి అనుకూలంగా ఉంటుందని ఎగుమతి కంపెనీలు చెబుతున్నాయి. ఇక్కడ పండే అరటికి షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది కాబట్టే వాటిని గల్ఫ్‌కు ఎగుమతి చేస్తున్నామని నోవా ఫ్రెష్ బనానా కంపెనీ సీనియర్ మేనేజర్ చెప్పారు. ”ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా అరటి ఎక్కువగా పండించేది అనంతపురం, కడప, నంద్యాల, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలు. ఎగుమతుల విషయానికి వస్తే ప్రధానంగా రాయలసీమలోని అనంతపురం, కడప, నంద్యాల జిల్లాల నుంచే ఎక్కువ. ఎందుకంటే, జీ9 (గ్రాండ్9) రకం అరటి ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. దీంతో అరటి నాణ్యత మెరుగుపడి, వాటికి షెల్ఫ్ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అందుకే వాటిని ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.

ఎగుమతులపై యుద్ధం ప్రభావం..

ఉద్యానవన పంటలకు కేంద్రంగా మారిన రాయలసీమలో పండే అరటికి గల్ప్ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అలా డిమాండ్ ఉన్నవాటిలో జీ9 రకం అరటి ఒకటి. దీన్ని ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 15 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. అలాగే కడప, నంద్యాల జిల్లాల్లో కూడా ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ జీ9 అరటి రకంవైపే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తంగా రాయలసీమలో అరటి సుమారు 40 వేల హెక్టార్లలో సాగు అవుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత యుద్ధ వాతావరణం, గల్ఫ్ దేశాలపైనా బాంబుదాడులు జరుగుతుండడంతో అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మెన్నటివరకూ టన్ను రూ.25 వేల వరకూ పలికిన అరటి ధర ఇప్పుడు ఏడెనిమిది వేల రూపాయలకు పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh agriculture Banana Exports to Iran Banana Prices Drop Horticulture News Iran War Impact Middle East crisis Rayalaseema Banana Farmers Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.