IPS Officer Controversy: ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి(IPS Ammi Reddy)కి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సోమవారం ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)ను కించపరిచేలా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు మండలి వర్గాలు వెల్లడించాయి.
Read also: AP: టిడిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు బిసికే
వివరణ ఆధారంగా తదుపరి చర్యలు
గతంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేసిన సమయంలో అమ్మిరెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన శాసనమండలి, వ్యవహారాన్ని హక్కుల కమిటీకి అప్పగించింది.
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే హక్కుల కమిటీ సమావేశానికి హాజరై తన వివరణ ఇవ్వాలని అమ్మిరెడ్డికి నోటీసుల్లో ఆదేశించారు. కమిటీ ముందు ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: