IPS Ammi Reddy: ఐపీఎస్ అధికారి కి ప్రివిలేజ్ నోటీసులు

Read Time:  1 min
IPS Ammi Reddy
IPS Ammi Reddy
FONT SIZE
GET APP

IPS Officer Controversy: ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి(IPS Ammi Reddy)కి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సోమవారం ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh)ను కించపరిచేలా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు మండలి వర్గాలు వెల్లడించాయి.

Read also: AP: టిడిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు బిసికే

IPS Officer Controversy
IPS Ammi Reddy

వివరణ ఆధారంగా తదుపరి చర్యలు

గతంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేసిన సమయంలో అమ్మిరెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన శాసనమండలి, వ్యవహారాన్ని హక్కుల కమిటీకి అప్పగించింది.

ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే హక్కుల కమిటీ సమావేశానికి హాజరై తన వివరణ ఇవ్వాలని అమ్మిరెడ్డికి నోటీసుల్లో ఆదేశించారు. కమిటీ ముందు ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.