📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Investments : పెట్టుబడులు పెట్టండి.. పేదలకూ సాయం చేయండి

Author Icon By Shravan
Updated: July 29, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ – సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం : సిఎం చంద్రబాబు నాయుడు

విజయవాడ : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ పెట్టుబడులు (Investments) కూడా అత్యంత భద్రంగా ఉంటాయని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య నదస్సుకు సన్నాహకంగా ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరమ్ తరపున రోడ్ షో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశానికి సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో పాటు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రోడ్ షో కార్యక్రమంలో ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీలు, ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు ఏపీ అభివృద్ధి కోసం రూపోందించిన 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నవంబర్ 14,15వ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న పెట్టుబడుల నదస్సుకు రావాల్సిందిగా సింగపూర్ కంపెనీలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం 2014లో సింగపూర్ (Singapore) దేశానికి వచ్చాను. ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన పరిణామాలతో సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ సంబంధాలు దెబ్బితిన్నాయి. ప్రస్తుత పర్యటన ద్వారా వాటి పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాను అన్నారు. సింగపూర్ నుంచి స్పూర్తితో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామన్నారు.

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్, డేటా సెంటర్, ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. ఆరు ఆపరేషనల్ పోర్టులు ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరో 4 పోర్టులు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయి. దేశంలోని మారిటైమ్ కార్గోలో 30 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. మారిటైమ్ కార్గో రంగంలో ఏపీకి ఎంతమేర అవకాశాలు ఉన్నాయో మీరే ఊహించుకోవచ్చు. ఏపీకి అనుబంధంగా ఉన్న రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోర్టు కార్గో హ్యాండ్లింగ్ కు అవకాశం ఉంది. ఏపీలో 7 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. అలాగే మరో 9 ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల నిర్మాణం కూడా చేయాలని భావిస్తున్నాం. ఇన్నోవేషన్ సహా విమానాల మరమ్మత్తులు, నిర్వహణ, ఓవర్ హాలింగ్ రంగాల్లోనూ పెట్టుబ డులను ఆకర్షించేలా విధానాలు రూపోందించాం. ఇన్ ల్యాండ్ వాటర్ వేస్, రైల్ కార్గో లాంటి సదుపాయాలు కూడా ఏపీలో ఉన్నాయి. తక్కువ వ్యయంతో రవాణా అన్నదే మా లక్ష్యం. తద్వా రా ఎగుమతులు, దిగుమతులకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. “అని చంద్రబాబు వివరించారు.

స్టార్టప్ ఎకోసిస్టం కోసం ప్రత్యేక హబ్ లు

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, అనంతపురం, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ నగరాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేలా వివిధ పారిశ్రామికవేత్తలకు అప్పగించామన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రతీ కుటుంబం నుంచి ఓ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంతో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే విధానం తీసుకు వచ్చామన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధుల్ని కలిశానన్నారు.  మీ పెట్టుబడులకు బెస్ట్ అండ్ సేఫ్ ప్లేస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. భారత తూర్పుతీరానికి ఏపీ పెట్టుబడుల గేట్ వేగా ఉంటుంది.” అని ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు ప్రసంగం తర్వాత జరిగిన ముఖాముఖిలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సింగపూర్ఎపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తే.. యువ పారిశ్రామిక వేత్తలకు చాలా ఉపయోగ కరంగా ఉంటుందనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ రోడ్ షోలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Renewable Energy : 2029 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం

Breaking News in Telugu Economic Development financial assistance Inclusive Growth Investments Latest News in Telugu Support for Poor Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.