📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Investments : రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు – మంత్రి లోకేష్

Author Icon By Shravan
Updated: August 1, 2025 • 9:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాబోయే అయిదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఎపిలో 45వేల కోట్ల పెట్టు బడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని రాష్ట్ర విద్య, ఐటి, శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh), తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 4రోజులపాటు విజయవంతంగా సింగపూర్లో పర్యటన పూర్తిచేశాం, ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్కు బ్యాడ్ న్యూస్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలమంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 4 రోజుల పాటు నిర్వహించిన సింగపూర్ టూర్ విశేషాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 1995 నుంచి సింగపూర్తో సిఎం చంద్రబాబుకు అనుబంధం ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 8 నుంచి రాత్రి 11.30వరకు రాష్ట్రంకోసం అహర్నిశలు కష్టపడు తున్నారు. సిఎంతోపాటే మేంకూడా పోటీపడి పనిచేస్తున్నాం. రికార్డులను సరిచేయడానికే వెళ్లామ న్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా చంద్రబాబును అక్కడి ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.  కొందరు హైకమీషనర్ కు రాష్ట్రంలో ఆస్థిరమైన ప్రభుత్వం ఉందని, పెట్టుబడులు పెట్టొద్దని ఈ మెయిల్ పంపారు. మేం ఆరా తీస్తే ఆ వ్యక్తి పెద్దిరెడ్డికి చెందిన  వైసిపి నేతలతో తరచూ మాట్లాడినట్లు తేలిందని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఇటువంటి కుట్రలకు తెరలేపారు. టిస్ఎస్ కు 99 పైసలకే భూములిస్తే కోర్టులో కేసులు వేశారు. చెన్నయిలో ఒక కంపెనీకి ఇబ్బంది వస్తే రాజకీయాలకు అతీతంగా అక్కడ రాజకీయా పక్షాలన్నీ సింగపూర్ హైకమిషనర్ వద్దకు వెళ్లారు. రాజకీయ పోరాటం చెన్నయ్ వరకే, బయటకు వచ్చాక మేమంతా తమిళనాడు వాళ్లం, రాష్ట్రం కోసం కలసికట్టుగా ప్రయత్నిస్తామని వారుచెప్పారు. మన రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధి కోసం బాండ్స్ విడుదల చేస్తే ఆర్ బిఐ నుంచి అందరికీ ఈమెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఇటువంటి వారివల్లే ఎపి బ్రాండ్ పడిపోతుంది.

పట్టుదలతో పరిశ్రమలు రప్పిస్తున్నాం

సిబిఎన్ 4.0 అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజి నెస్. 2024లో గెలిచిన వెంటనే ఆదిత్య మిట్టల్తో జూమ్ కాల్లో చర్చించాను. ఎన్ ఎండిసి రా మెటీరియల్ కోసం సిఎంతో మాట్లాడి గ్రీన్ సిగ్నల్ ఇప్పించాను. ప్రధానితో ఈ విషయమై 3సార్లు చంద్రబాబు మాట్లాడారు. త్వరలో ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తాం. 2029 నాటికి కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. భారతదేశంలోనే అతిపెద్ద డాటా సెంటర్ విశాఖకు రాబోతోంది. ముంబాయి వెళ్లి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో చర్చలు జరిపామన్నారు. దాంతో టాటా పవర్, టిసిఎస్ రాష్ట్రానికి వచ్చాయి. టాటా పవర్ 7గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటుచేయబోతోంది. దావోస్ వెళ్లినపుడు కాగ్నిజెంట్ సిఇఓను కలిశా. విశాఖవస్తే 99 పైసలకు భూమి ఇస్తామని టిసిఎస్ రావడంతో ఆ తర్వాత కాగ్నిజెంట్ వచ్చింది. రాబోయే నాలుగేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

మేము భారతీ సిమెంట్స్, హెరిటెజ్ కు భూములు ఇవ్వలేదు, యువతకు ఉద్యో గాలు ఇచ్చే టిసిఎస్, కాగ్నిజెంట్స్, డాటా సెంటర్ లకు ఇచ్చాం, ఎస్ఐపిబి పెట్టి మూడురోజుల్లో కేబినెట్ కు తెచ్చి ఐటి సంస్థలకు అనుమతులు ఇచ్చాం. ఎపికి పెట్టుబడులు రావాలి, 2029కల్లా ఉద్యోగాలు ఇవ్వాలన్న కండీషన్ తో భూములిచ్చాం. ప్రధాని మోడీజీ నుంచే మాకు 99 పైసలకు భూములు కేటాయించే ఐడియా వచ్చింది. మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నపుడు పశ్చిమ బెంగాల్ అంగీకరించకపోతే టాటా మోటార్స్ నానో పరిశ్రమకు తక్కువ ధరకు భూములు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆ నిర్ణయం కరెక్టు అని చెప్పింది, వేలకోట్ల భూములు కట్టబెడుతున్నామని ఆరోపణలు చేసేవారు గత ప్రభుత్వంలో ఒక్క ఎకరం ఎందుకు అమ్మలేకపోయారు? లులూకి ఇచ్చిన భూమి ఆక్షన్కు పెడితే గతంలో ఒక్కడూ ముందుకు రాలేదు. వాళ్ల మాటవింటే రాష్ట్రం నష్టపోతుంది. పెట్టుబడుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. 1995లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని హేళన చేశారు. సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారాయి. హాస్పిటాలిటీ, రిటైల్ రంగంలో మాగ్జిమమ్ జాబ్స్ వస్తాయి. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో 50వేల హోటల్ రూమ్ లు రావాలని సిఎం డైరక్షన్ ఇచ్చారు. విశాఖ, తిరుపతి, కర్నూలు, అమరావతి, కాకినాడ, రాజమండ్రిలో పెద్దఎత్తున హోటల్స్ రాబోతున్నాయి. ఉద్యోగాల కల్పనే మా ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్రంలో గత14నెలల్లో పెద్దఎత్తున ఎంఎస్ఎంఇ పరిశ్రమల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. త్వరలోనే ప్రోత్సాహకాలు విడుదల చేస్తాం. ఎంఎస్ ఎంఇల కోసం ఒక ప్రత్యేక మోడల్ వర్కవుట్ చేయమని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక నెలలో ఆ మోడల్ ను కేబినెట్ ముందుకు తెస్తామన్నారు.

సింగపూర్ పారిశ్రామికవేత్తలతో జరిగిన చర్చల్లో చంద్రబాబు గారు మేము మీతో

ఉన్నాం, కలసికట్టుగా పనిచేద్దామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానివృద్ధి కోసం అద్భుతమైన రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్ ఏర్పాటుచేశామని భరోసా చెప్పారు. అమరావతితోపాటు ఎస్ఇడ్లు, పోర్టుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెడతా మని వారు చెప్పారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఏదేశం మార్పునకు సిద్ధంగా ఉంటుందో ఆ దేశం ఎక్కువ ఉద్యోగాలను సాధిస్తుంది. అందుకే కరిక్యులమ్లో ఎఐ అండ్ ఎంఎల్ ఉండాలని ఉన్నత విద్య చైర్మన్ కు సష్టంగా చెప్పాం, క్వాంటమ్ కంప్యూటింగ్ తెస్తున్నాం.

సెప్టెంబర్ లో విశాఖకు టిసిఎస్!..

ఈ యేడాది సెప్టెంబర్లో విశాఖపట్నంలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభమ వుతాయి. అక్టోబర్లో కాగ్నిజెంట్ వస్తుంది. ఎపి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన సిఎం సింగపూర్ నుంచే ఆదేశాలు ఇచ్చారు. తప్పుడు ప్రచారం వల్ల స్టార్టప్ కంపెనీలకు అనుమానాలు వస్తాయి. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆర్ బిఐ, సెబీకి మెయిల్స్ పంపారు, ఇప్పుడు సింగపూర్లో మినిస్టర్స్, సెక్రటరీలకు పంపారు, నిన్నకోర్టులో కేసువేశారు. అయితే చంద్ర బాబు గురించి సింగపూర్ ప్రభుత్వానికి తెలుసు. అందుకే వారి ఫిర్యాదులను పక్కన బెట్టారు. పరిశ్రమలకు సంబందించి మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 5వేల ఎకరాలు ఎందుకు అని ఆనాడు ప్రశ్నించారు. ఈరోజు భారత్ లోనే బెస్ట్ ఎయిర్ పోర్టుగా హైదరాబాద్ తయారైంది. వందేళ్లకు సరిపడా విస్తరించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టు సరిపోకపోవడంతో బెంగుళూరులో రెండో ఎయిర్ పోర్టు కడుతున్నారు. ముందుచూపుతో ఆలోచించి చంద్రబాబుగారు సిఎంగా ఉన్నపుడు హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో డిజైన్ చేశారు, బాబు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాటిని కొనసాగించారు, అదే హైదరా బాద్ అదృష్టం, జగన్ మాదిరిగా అక్కడ అడ్డుపడలేదు, జగన్ లాంటి నాయకుడు ఉండటం మన రాష్ట్ర దౌర్భాగ్యన్నారు.. ఎవ్వరెన్ని అడ్డంకులు సృష్టిం చినా రాష్ట్ర అభివృద్ధి ఆగదన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : YS Jagan : జ‌గ‌న్, నెల్లూరు ప‌ర్య‌ట‌న‌పై మూడు కేసులు న‌మోదు

Andhra Pradesh Projects AP Development Breaking News in Telugu Future Plans Investments Latest News in Telugu Minister Lokesh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.