📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

International Airport: భోగాపురం విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్..

Author Icon By Pooja
Updated: January 4, 2026 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారం కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(International Airport) ఆదివారం ఉదయం 10.15 గంటలకు తొలి వాణిజ్య విమానంతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. జీఎంఆర్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ చారిత్రక సందర్భంలో ఎయిర్ ఇండియా విమానం రన్‌వే మీద ల్యాండ్ కానుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సహా పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకోనున్నారు.

Read Also: Telangana: కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు దుర్మార్గం: కేటీఆర్ ఘాటు విమర్శలు

International Airport

96 శాతం పూర్తైన నిర్మాణ పనులు

అధికారుల సమాచారం ప్రకారం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) నిర్మాణ పనులు ఇప్పటికే 96 శాతం పూర్తి అయ్యాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గతంలో హుద్‌హుద్ వంటి తీవ్ర తుఫాన్లను తట్టుకునేలా డిజైన్ చేశారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ప్రభావం పడని విధంగా నిర్మాణం చేపట్టారు. అలాగే 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా నీరు నిలవకుండా బయటకు వెళ్లేలా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఖర్చు, సామర్థ్యం, వాణిజ్య అవకాశాలు

తొలి దశలో ఈ ప్రాజెక్టు కోసం రూ.4,725 కోట్లను వెచ్చించారు. ఈ విమానాశ్రయం రోజుకు సుమారు 200 విమానాల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏడాదికి దాదాపు 20 వేల టన్నుల సరుకు ఎగుమతులకు అవకాశం కల్పిస్తుంది. రాత్రి వేళలో 18 విమానాలను ఒకేసారి పార్కింగ్ చేసుకునే సదుపాయాలు కూడా ఉన్నాయి.

ప్రయాణికుల అంచనాలు & మౌలిక సదుపాయాలు

ఇక్కడి నుంచి ప్రయాణించే వారిలో 33 శాతం మంది విశాఖ నగరవాసులు కాగా, మిగిలిన 67 శాతం మంది ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలకు చెందినవారై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల కోసం 14 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి చేరుకునేందుకు మూడు ప్రధాన రహదారులను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

విమానాశ్రయ టెర్మినల్ లోపల విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం, ఏటికొప్పాక కళాకృతులు ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిఫలించేలా అంతర్గత అలంకరణలు చేయనున్నారు.

భారీ విమానాలకు అనుకూల రన్‌వేలు

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అంతర్జాతీయ బిడ్స్ ద్వారా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఒకేసారి 300 విమానాలు దిగేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించడం విశేషం. ఎయిర్‌బస్ A380, బోయింగ్ 747-8 వంటి ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలు సైతం సులభంగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేలను రూపొందించారు. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యంతో టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu Uttarandhra Vizianagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.