📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Intellectual migration : మేధో వలసలను ఆపలేమా!

Author Icon By Sudha
Updated: December 30, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొందర్ని తమ దేశం బహిష్కరించవచ్చు. ఒక దేశాన్ని కొందరు తృణీకరించవచ్చు. కానీ మేధస్సు లేమితనం మందకొడి జనం ఉన్నంత కాలం ఆయా దేశాలు మన జాలవు. ఇలాంటివి గుర్తించిన పాలకులు మాత్రం ఇతర దేశాల నుంచి మేధావులను తెచ్చుకుంటుంటాయి. ప్రపంచంలో ఈ అంశాలపై చిత్ర విచిత్రమైన పరిస్థితులు దాపురించాయి. తాజాగా పాకిస్థాన్ నుంచి మేధో వలస ప్రారంభమైంది. తాజా అంశాలను పరిశీలిస్తే పాకిస్థాన్ నుంచి మేధావులు తమ సొంత దేశాలకు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ దేశంలో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను బేరీజు వేసుకుని డాక్టర్లు, ఇంజినీర్లు, అక్కౌంటెంట్లు అక్కడ ఉండలేక వేరే దేశాలకు లేదా తమ సొంత దేశాలకు వెళ్తున్నారన్న సమాచారంలభించింది. గత రెండేళ్లుగా చాపకింద నీరులా వలసలు ప్రారంభమయ్యా యి. ఫలానా కారణం అని చెప్పకుండా మంచి ఆఫర్లు వచ్చాయనో, మానసికంగా అక్కడ ఉండలేకపోతున్నామనే భావనతో బయటికి వచ్చేస్తున్నారు. ఇంటి బెంగ మరి కొందరికి. పాకిస్థాన్లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, రాజ కీయ అస్థిరత, భవితపై అపనమ్మకంతో ‘పాకకు స్వస్తి చెబుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో పాకిస్థాన్ నుంచి ఐదువేల మందికిపైగా డాక్టర్లు, 11వేల మంది ఇంజినీర్లు, 13వేల మంది అక్కౌంటెంట్లు తరలివెళ్లిపోయారు. మేధస్సు కలిగిన విదేశీయులను మాత్రమే అమెరికా ఉంచుకోవాలనుకుంటోంది. అలాంటి సుగుణాలేమీ లేని వారిని నజరానాలు ఇచ్చి మరీ పంపేస్తోంది. కాగా పాక్ నుంచి ఖాళీ చేస్తున్న మేధోయువత కారణంగా దేశ భవిత ప్రశ్నార్థకమవుతోంది. వీటితోపాటు సౌదీ అరేబియా సంగతి చూద్దాం. ఈ యేడాది అత్యధికంగా భారతీయులను స్వదేశానికి డిపోర్ట్ చేసిన ఘనత ఆదేశానిది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల రాజ్యసభకు సమర్పించిన నివేదిక ఎన్నో సంచలనవివరాలను బయటపెట్టిం ది. 2025లో ప్రపంచ చిత్రపటంలోని 81 దేశాలు దాదాపు 24,600 మంది భారతీయులను ఇంటికి పంపే సింది. బతిమాలో, బామాలో హెచ్చరించో బెదిరించో అన్నది ఇక్కడ అప్రస్తుతం. సౌదీ అరేబియా నుంచి 11 వేల మంది భారతీయులు ఏమయితేనేంవెనక్కి వచ్చే సారు. అమెరికా నుంచి డిపోర్ట్ అయిన భారతీయులు 3,800మంది. అందరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లే కాదు, విద్యా ర్థులు ప్రైవేట్ ఉద్యోగులూ ఉన్నారు. సైబర్ ముఠాలతో సంబంధముండి కేసుల్లో చిక్కుకున్న 1,469 మందిని నిర్దాక్షిణ్యంగా భారత్కు పంపేసింది. వీరిలో ఎకు్వమంది తెలుగువారే ఉండటం దురదృష్టకరం. వీసా కాలపరిమితి తీరడం, లేదా పొడిగింపు అనుమతి, వెసులుబాటులేక, అనధికార ఉద్యోగాలు చేస్తూ దొరికి పోయిన వారు స్వగ్రామాలకు తిరిగి రావాల్సి వచ్చింది. గల్ఫ్ దేశాల నుంచి ఇలా వచ్చిన వారిలో ఎక్కువమంది విద్యార్థులు. ఈయేడాది యుకె 170 మందిని, ఆస్ట్రేలియా 114 మంది, రష్యా 82 మంది, అమెరికా 45 మంది భారతీయుల్ని మాత్రమే భారత్కు పంపేసింది. కానీ ‘డాలర్ డ్రీమ్స్’లో పడి దొడ్డిదారిన ఆయా దేశాల్లోకి వెళ్లిన వారికి తిప్పలు తప్పడంలేదు. ఇలాంటివి ఎవరూ ప్రోత్సహించకూడదు. ఇటీవలఅమెరికా అధ్యక్షుడు భారతీయుల్ని వెనక్కి పంపిన విధానంలో భారతీయులు ఆక్రోశం చెందారు. అక్రమ వలసలపై కఠిన చర్యల కారణంగా తమఉనికిని బయటకు తెలియకుండా కాలక్షేపం చేసినవారు కూడా అమెరికా విదే శాంగ శాఖకు దొరికిపోయారు. ప్రత్యేక సైనిక విమానంలో ‘డిపోర్టుచేసింది. కొన్ని సందర్భాల్లో వలసదారులు కాళ్లకు సంకెళ్లు తప్పలేదు. అంత అమానవీయ పరిస్థితులలో బయటపడ్డారు. ఇంటిముఖం చూశారు. పాకిస్థాన్ మనకు దాయాది దేశమైనందున ఇటీవల పహల్గాం ఉగ్రవాదదాడి అనంతరం ఆ దేశం ఇతరత్రా భారత్ అనుకూల దేశాల నుంచే కాక దాదాపు ఎక్కువ దేశాలు పాక్ను పక్కన పెట్టాయి. ఆ దేశం ఆర్థిక చక్రం మందకొడిగా తిరుగుతోం ది. ఎవరు ఎలాఆదుకున్నా గట్టెక్కేపరిస్థితి లేదు. ఇలాం టి స్థితిలో భారత్ పాక్ ల మధ్య ఎలాంటిస్థాయి యుద్ధ మొచ్చినా పాకిస్థాన్ ఏమవుతుందో అంచనా చేయగలిగిన మేధావులే
వలస(Intellectual migration) వెళ్లిపోతున్నారు. దీనివలన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ముప్పు తప్పదనే అంచనాలు న్నాయి. ఈ వలసలతో ఆరోగ్యం, ఇంజినీరింగ్ఫైనాన్స్ వంటి కీలక రంగాలు బాగా దెబ్బతిన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ భారత్పైచిందులేస్తూ వ్యవహరిస్తున్న తీరు కూడా అక్కడ మనుగడ సాగిస్తున్న మేధావులలో ఆగ్రహం వ్యక్త మైంది. రాబోయేకాలంలో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటా యో ఊహించుకుని వల సల బాటపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్ గా గుర్తింపు పొందిన పాకి స్థాన్ తరచుగా జరిగే ఇంటర్నేట్ షట్లెడౌన్ల కారణంగా యేటా 1.62 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దాంతో దాదాపు 23.7 లక్షల ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగుల నుంచి భవిష్యత్ కోసం పాకిస్థానన్ను వీడాలని నిర్ణయించు కున్నారు. ఒకానొక దశలో ఈ వలసలపై (Intellectual migration) వ్యాఖ్యానిస్తూ పాక్ ఆర్మీచీప్ ఆర్మీజనరల్ ఆఫ్ పాకిస్థాన్ మునీర్ వ్యా ఖ్యలు ఎంతోవ్యంగ్యంగా వినవస్తుతున్నాయి. ఈ బ్రెయిన్ డ్రెయిన్ను అంతర్జాతీయ సమాజానికి పాక్ఇ ఇస్తున్న బహు మతి అనే ధోరణిలో ‘బ్రెయిన్ డ్రెయిన్’గా అభివర్ణిస్తుంటే మేధావి వర్గాలు మునీర్ అహంభావపు మాటల్ని నిరసి స్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే పాక్ నుంచి వైట్కాలర్, అసంఘటిత నైపుణ్య కార్మికులతోపాటు బిచ్చగాళ్లు కూడా ఆ దేశంలో ఉండటానికి ఇష్టపడటం లేదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Brain Drain BreakingNews education employment opportunities Intellectual Migration latest news Skilled Migration Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.