📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

Insurance sector: బీమా రంగంలో శత శాతం ప్రైవేటీకరణ సురక్షితమా?

Author Icon By Sudha
Updated: December 22, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీమా రంగం ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక మైన రంగం. ప్రజల జీవితాల్లో అనిశ్చితి ఎదురైనప్పుడు భద్రత కల్పించే ప్రధాన సాధనం బీమానే. ప్రమాదాలు, అనారోగ్యం,మరభయం, ప్రకృతి విపత్తులు వంటి సంద ర్భాల్లో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పిస బీమా వ్యవస్థ సామాజిక భద్రతకు పునాదిగా నిలుస్తుంది. అలాంటి ప్రాధా న్యత కలిగిన బీమా రంగంలోశతశాతం ప్రైవేటీకరణ సుర క్షితమా అనే ప్రశ్న ఈరోజుల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి, సామాన్య ప్రజల భవిష్యత్తుకు మేలు చేస్తుందా లేక ప్రమాదాలను పెంచుతుందా అనే అంశాన్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. బీమా రంగం కేవలం లాభనష్టాల గణాంకాలతో కొలిచే రంగం కాదు. రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు,వృద్ధులు వంటి విభిన్న వర్గాల ప్రజల జీవితాలతో ఇది ముడిపడి ఉంటుంది. భారతదేశంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు (Insurance sector), ముఖ్యంగా భారతీయ జీవిత బీమా సంస్థ, గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా బీమా సేవలు అందిస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించాయి. బీమా లాభదాయకంగా లేని ప్రాంతాల్లో కూడా సేవలు అందించ డమే ప్రభుత్వ రంగ ప్రత్యేకత. ఇలాంటి వ్యవస్థలో శత శాతం ప్రైవేటీకరణ జరిగితే సామాజిక బాధ్యత కంటే లాభాలే ప్రాధాన్యం పొందే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నష్టాన్ని ప్రైవేటీకరణకు అనుకూలంగా విదేశీ పెట్టుబడులు పెరుగు తాయని, పోటీవల్ల సేవల నాణ్యత మెరుగవుతుందని, కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుందని వాదిస్తోంది. కొంత వరకు ఇవి నిజమే. ప్రైవేట్ రంగ ప్రవేశంతో డిజిటల్ బీమా సేవలు, కొత్త పాలసీలు వచ్చిన విషయం వాస్తవం. అయితే శతశాతం ప్రైవేటీకరణలో ఈ ప్రయోజనాలతోపాటు తీవ్ర మైన ప్రమాదాలు కూడా దాగి ఉన్నాయి. ప్రైవేట్ బీమా సంస్థలు ప్రధానంగా లాభాలు వచ్చే నగరప్రాంతాలు, అధిక ఆదాయం కలిగిన వినియోగదారులపైనే దృష్టిసారించే అవ కాశం ఎక్కువ. దీనివల్ల గ్రామీణ ప్రజలు,పేదలు, చిన్న రైతులు బీమా (Insurance sector)కవరేజ్కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు.

Read Also : http://Pension News: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దు వార్తలపై కేంద్రం వివరణ

Insurance sector

బీమా రంగం ప్రజల పొదుపులతో నేరుగా ముడిపడి ఉం టుంది. కోట్లాది మంది పాలసీదారులు తమ జీవిత పొదుపులను బీమా సంస్థలపై నమ్మకంతో పెట్టుబడి పెడతారు. ఒకవేళ ప్రైవేట్ లేదా విదేశీ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో పడితే లేదా వ్యాపార ప్రయోజనాల కోసం దేశం విడిచిపెడితే, ఆ భరించాల్సింది చివరకు ప్రజలే. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులు దేశీయ బీమా రంగంపై ప్రభావం చూపితే ఆర్థిక అస్థిరత పెరిగేప్రమాదం కూడా ఉంది. ప్రైవేటీకరణవల్ల ఉద్యోగభద్రతపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో ఉద్యో గులకు స్థిరత్వం, సామాజిక భద్రత, కార్మికహక్కులుంటాయి. ప్రైవేట్ రంగంలో మాత్రం లాభాల ఆధారంగా ఉద్యోగ నియామకాలు, తొలగింపులు జరుగుతాయి. దీనివల్ల వేలాది ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితిలోపడే అవకాశంఉంది. ఉద్యో గ భద్రత లేకపోతే సేవల నాణ్యతపై కూడాప్రభావం పడుతుందన్న వాస్తవాన్ని విస్మరించలేం. బీమారంగంలో ప్రభుత్వ రంగసంస్థల పాత్రను విస్మరించడం సాధ్యంకాదు. భారతీయ జీవిత బీమా సంస్థ దేశంలోని మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, సంక్షోభ సమయంలో ప్రభుత్వా నికి ఆర్థిక మద్దతు వంటి అనేక సందర్భాల్లో కీలకంగా నిలిచింది. లాభాల కోసమే కాకుండా దేశప్రయో జనాల కోసం పనిచేసే ఇలాంటిసంస్థలు బలహీనపడితే దేశ ఆర్థికవ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. బీమారంగాన్నినియం త్రించే సంస్థలు ఉన్నప్పటికీ, శతశాతం ప్రైవేటీకరణ తర్వాత నియంత్రణ సవాళ్లుమరింత పెరుగుతాయి. పెద్ద కార్పొరేట్ సంస్థలు, విదేశీ పెట్టుబడి దారుల ప్రభావం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడితే వినియోగదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉంది. నియమాలు సడలితే పాలసీదారుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రభుత్వ రంగం కేంద్రపాత్రలో ఉండి, ప్రైవేట్ రంగం సహాయక పాత్ర పోషిస్తేనే సామాజిక భద్రతతో పాటు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది.
-తిప్పర్తి శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News financial sector Indian Economy insurance reforms Insurance Sector latest news privatization Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.