📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Innovations – వైద్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు – చంద్రబాబు

Author Icon By Shravan
Updated: August 26, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Innovations : వైద్యారోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోని రతన్ టాటా (Ratan Tata) ఇన్నోవేషన్ హబ్ లో అంతర్భాగంగా ఈ రీసెర్చి ఇన్నోవేషన్ కార్యకలాపాలు ఉంటాయని ఆయన అన్నారు. ఏఐ, మెడ్ టెక్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియాపసిఫిక్ బయోడిజైన్ ఆలయన్స్, అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా భారత్ బయో డిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ దృష్టి సారించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో, నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా పని చేయనుంది.

ప్రజారోగ్య రంగంలో బ్రెయిన్ ప్రాజెక్ట్‌తో కొత్త ఆవిష్కరణలు: సీఎం

అంతర్జాతీయ, స్థానిక నైపుణ్యాలను సమన్వయం చేయటం ద్వారా ప్రజారోగ్య రంగంలో బ్రెయిన్ కార్యక్రమం గణనీయమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఆలయన్స్ కు చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులతో సీఎం సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు.. ఈ ప్రాజెక్టు ద్వారా మెడికల్ టెక్నాలజీ రంగంలో కొత్త స్టార్టప్ లతో పాటు పరిశోధనలు, నిపుణులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. తద్వారా ఏపీ నాలెడ్జి ఎకానమీ, ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్, జపాన్, సింగపూర్, తైవాన్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఆయా దేశాల్లో బయోడిజైన్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ, మెడ్ టెక్ అలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ కలపాల, స్టాన్ఫర్డ్ సెంటర్ ఫర్ బయోడిజైన్ ప్రొఫెసర్ ఆనురాగ్ మైరల్, ఆసియా పసిఫిక్ బయోడిజైన్ సహాధ్యక్షుడు డాక్టర్ యోనా వైస్బచ్, బయోడిజైన్ ఆస్ట్రేలియా ఛైర్ ప్రొఫెసర్ కెవిన్ ఫ్లెగర్, టోక్యో బయోడిజైన్ ప్రతినిధి యూరియోన్ కొబయాషి, తైవాన్ బయోడిజైన్ నుంచి జేమ్స్ చియెన్హియాట్సెంగ్, సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మార్క్ చాంగ్, మిరాయ్ మెడికల్ సహ వ్యవస్థాపకుడు కొలిన్ ఫోర్డే తదితరులు ముఖ్యమంత్రికి తమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ను వైద్యారోగ్య రంగంలో ఆవిష్కరణలకు, మెడిటెక్ పరిశోధనలకు కేంద్రంగా అభిచారు.

Today News : Innovations – వైద్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు – చంద్రబాబు

ఏపీని గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ హబ్‌గా మార్చే అవగాహనా ఒప్పందం

వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, సాంకేతిక అందించే అంశంపై గ్లోబల్ నిపుణులు ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందంకుదిరింది. ప్రత్యేకించియూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎయిమ్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంతో భారత్ బయోడిజైన్ బయోడిజైన్ ఆస్ట్రేలియాలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి. వైద్యారోగ్య రంగంలో (Healthcare sector) సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను నిర్వహించేలా ఈ ఒప్పందం సహకరించనుంది. ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ, డిజిల్ హెల్త్ ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమం ప్రధానంగా పనిచేయనుంది.

ముందస్తు విశ్లేషణల ద్వారా వ్యాధుల సంక్రమణను నియంత్రిం చటం, ముందస్తుగా ఆరోగ్య భద్రతా కార్యక్రమాలు, తక్కువ వ్యయంతో ఆరోగ్య సేవల్ని ప్రజలకు అందించే అంశాలపై దృష్టి సారించనుంది. ఆదే సమయంలో అంతర్జాతీయ బయో డిజైన్ ఎకో సిస్టంలను భారత్లో ఉన్న భాగస్వాములను అనుసంధా నించటం పైనా ఈ ఒప్పందం సహకరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా అను సరిస్తున్న ఉత్తమ విధానాల్ని ఏపీలో అమలు చేయటం, బయో డిజైన్లో శిక్షణ, పరిశోధనా రంగాల్లో అంతర్జాతీయ సహకారం, ప్రజారోగ్య రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించాలన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/dussehra-festival-arrangements-to-be-completed-by-september-15/andhra-pradesh/536305/

Breaking News in Telugu Chandrababu Naidu Health Sector Development Latest News in Telugu Medical Innovations Medical Research Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.