📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Inferior medicine : ఔషధ లీల.. మృత్యుహేల

Author Icon By Sudha
Updated: October 7, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణ దగ్గు వారం రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. అదే కోరింత దగ్గయితే చిన్నా రుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నా యి. కోరింత దగ్గు పీడితులు ఊపిరి పీల్చుకునేటప్పుడు కంగు కంగుమనే శబ్ధంతో దగ్గువస్తుంది. కోరింత దగ్గయి తే అంటు రోగమేనని చెప్పకతప్పదు. ఈ రెండింటికి తేడా తెలియక దగ్గు సంకేతాలు తెలియగానే పిల్లలకు వెంటనే దగ్గు మందు ఇచ్చేసి అదే తగ్గిపోతుందులే అనుకోవడం కద్దు. కానీ దగ్గు మందు నాణ్యత బెడిసి కొట్టి మధ్యప్రదేశ్లో 14 మంది చిన్నారులను పొట్టన పెట్టు కుంది. ఈ సంఘటన గురించి తెలియగానే కేంద్ర ఆరోగ్య శాఖ మెళకువ తెచ్చుకుంది. ఎక్కడైనా దుస్సంఘటనలు జరుగగానే అప్పటికప్పుడు ప్రక్షాళన నిర్ణయాలు తీసుకోవ డం మన పాలకులకు అలవాటే. ఇక్కడా ప్రభుత్వం ఆ మేరకు స్పందిస్తోంది. నిబంధనలు పాటించని కంపెనీల లైసెన్సులను రద్దు చేస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ‘కోల్డిఫ్’ దగ్గు మందులను వాడిన వారిలో తీవ్ర ‘అనారోగ్య లక్షణాలు కనపడి అసువులు బాశారు. చాలా రాష్ట్రాలు సత్వరం ఆ మందులను నిషేధించాయి. ప్రాణాపాయానికి కారణమైన మందులను తమిళనాడు కాంచీపురంలో ఓ ఔషధ తయారీ సంస్థ నుంచి బయటి కొచ్చింది. అలాంటి నాసిరకం మందులను (Inferior medicine)కనిపెట్టాల్సింది ఆరోగ్యశాఖ కింద పనిచేసే ఔషధ నియంత్రణ విభాగమే. కానీ మార్కెట్లోకి విడుదలై పసిపిల్లల ప్రాణాలు తీసే వరకు తెలియలేదంటే ఏమనుకోవాలి. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖే బాధ్యత వహించాలి. కాగా ‘కోల్డిఫ్’ సిరప్ ను తయారు చేసిన శ్రేసన్ ఫార్మస్యూటికల్స్ మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉద్యుక్తమయ్యింది. ముందే తీసుకోవాల్సిన చర్యలు తర్వాత తీసుకుంటే ఏమవుతుంది? కొన్ని ప్రాణాలు బలైపోయాయి. మధ్య ప్రదేశ్లోని బేటుల్ జిల్లా, ఆమ్లాబ్లాక్లో ఇద్దరు చిన్నారు లు ఈ సిరప్ వాడాక మరణించారు. దాంతో ఛింద్వారా జిల్లాలోని పరాసియా ప్రజారోగ్య కేంద్రం పీడియాట్రిషి యన్ డాక్టర్ ప్రవీణ్ సోనిపై కేసు నమోదు చేశారు. ఆ డాక్టరు చాలా మందికి అదే సిరపను సిఫారసు చేశారు. ఈ సిరప్ 10నాణ్యతా ప్రమాణాల్లో 9 మాత్రమే అను గుణంగా ఉన్నాయని గుర్తించారు. ఈ మందు కలుషిత మైనట్లు గుర్తించి దాని తయారీ కంపెనీపై తమిళనాడు రెగ్యులేటరీ అధారిటీ ఎల్డీఎ చర్యలు తీసుకొంది. దాని లైసెన్సును రద్దు చేయమని సిడిఎస్ సిఓకు సిఫారసు చేసింది. ఇవన్నీ ఏదైనా దుస్సంఘటన జరిగినప్పుడు తీసుకునే చర్యలే. వీటిలో ప్రత్యేకత ఏమీలేదు. ఆ బ్యాచ్ సిరప్ సరుకుకు ఎలా అనుమతిచ్చి, మార్కెట్లోని విడు దలై, డాక్టర్ల చేత సిఫారసు చేయబడిందంటే వీటికిఇందులో ఎవరి నిర్లక్ష్యం ఎంత ఉందో పసికట్టి వారిపై చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ మందు వాడిన పిల్లలకు మూత్రపిండాల సమస్యలు వచ్చాయి. మూత్ర పిండాలు వాచిపోయి క్రియాటినైన్ లెవెల్స్ మారిపోయి తీవ్ర సమస్యలు తలెత్తాయి. మూత్రం బంద్ అయ్యింది. ఒక కేసులో లెప్టోసైరోసిస్ పొజిటివ్ కనపడింది. ఇంత సీరియస్ సంఘటనలో కూడా ప్రభుత్వ విభాగాల అల సత్వం బయటకు రాకుండా ఏ
వేవో సమర్థింపులుచేసుకుం టున్నారు. పైగా గ్రామీణ ప్రాంతం నుంచి ఆ చిన్నారులు రావడాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకోవాలని చూశారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టడం వారి నేరం కాదు. కానీ సంఘటనకు ఎవరూ బాధ్యత వహించడం లేదు. వైద్యులు దగ్గుమందులు రాసేటప్పుడు హేతుబద్ధంగా వ్యవహరించాలని కేంద్రప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇక్కడ హేతుబద్ధతకు అర్థం తెలియక కొంత మంది డాక్టర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో విడుదలైన దగ్గుమందులో రసాయనాలుంటాయని ప్రిస్క్రిప్షన్ రాసే మందు ఎలా తెలుస్తుందో జవాబు దొరకని ప్రశ్న. ఉదం తం జరిగాక ప్రాణాపాయంలో ఉన్న చిన్నారులకు ఎలాంటి వైద్యసహాయం అందలేదు. మరణించిన చిన్నారులకు పోస్టుమార్టెమ్ కూడా వెంటనే జరుగలేదు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాన్ని వెల్లడిస్తోంది. ‘కోప్టైడ్’ దగ్గు మందు కిడ్నీలకు హాని కలిగించే విషపూరిత పదార్థాలతో కలుషిత మైందని అనుమానిస్తున్నారు. కేవలం ఆ బ్యాచ్ సిరప్ ఎస్ఆర్ 13ను మాత్రమే నిషేధించారు. ఈ బ్యాచ్ సిరప్ లు మరెక్కడా వాడకుండా సీజ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇలా అనంతర జాగ్రత్తలు చిన్నారుల ప్రాణా లు నిలబెట్టలేవు. కనుక సిరప్లు తయారయ్యే ఫార్మసీ కంపెనీల వద్దనే సంపూర్ణ స్థాయిలో పరీక్ష, విశ్లేషణ, పర్యవేక్షణ పటిష్టం చేయాల్సిన అవసరముంది. తీరా నాసిరకం ఔషధాలు బయటికొచ్చి రోగి శరీరంలోకి ప్రవేశించాక చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందాన ఉంటుంది. ‘కోల్డిఫ్’ దగ్గుమందును ల్యాబ్ లో పరీక్షించి చూస్తే డైథిలీన్ గ్లైకాల్ (డిఇజి) ఇథైలీన్ గ్లైకాల్ (ఈజీ)గా పిలిచే ప్రమాద రసాయన ఆన వాళ్లున్నాయి. ఈ రెండూ మానవ శరీరం లోని మూత్రపిండాలు, కాలేయంలతో పాటు నాడీ వ్యవస్థలను దెబ్బతీస్తాయి. చిన్న ఫార్మా కంపెనీలు తమ ఔషధ ఉత్పత్తులను మార్కెటింగ్ సందర్భంలో డాక్టర్లకు తృణమో ఫణమో ఆశ చూపి స్తారు. ఆ నేపథ్యంలోనే డాక్టర్లు కొన్ని మందులను వాడమని సిఫార్సు చేయడం సహజం. డా.ప్రవీణ్ సోనీ ప్రభుత్వ డాక్టరు. కానీ తన ప్రైవేటు ప్రాక్టీసులో చిన్న పిల్లలకు పై నాసిరక మందును (Inferior medicine)సిఫారసు చేశారు. అదే ఆయన తప్పిదమైంది. ప్రతి విషాద ఉదంతం జరిగినప్పు డు ఆ తర్వాత మరో విషాదం జరుగకూడదని మన స్ఫూర్తిగా, చిత్తశుద్ధితో సంకల్పం చెప్పుకుంటే తప్ప మానవ జీవన ప్రమాణాలను పెంచలేము.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News fake drugs inferior medicine latest news pharmaceutical fraud public health substandard medicine Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.