19నుండి 28 వరకు వసంత పుష్పార్చన
Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చారిత్రక ఆధారాలను పరిశీలించిన అనంతరం శిథిలావస్థలో ఉన్న పాశు పతేశ్వర ఆలయాన్ని ఆదివారం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇ. వీకే శీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సందర్శించారు. వారణాసి శైలిలో నాలుగు ద్వారాలతో నిర్మితమై, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ చారిత్రక ఆలయాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ “పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణ కోసం భక్తుల నుండి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపాము. కొండపైకి వెళ్లే దారిని సుగమం చేయడం, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం వంటి పనులపై దేవదాయ శాఖ మంత్రి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాము” అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ట్రస్ట్ బోర్డు సభ్యులు హరికృష్ణ, దేవస్థానం ఇంజినీరింగ్ సిబ్బంది, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: Srisailam: శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు
ఆలయంలో గ్యాస్ కొరత లేదు
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి గ్యాస్ కొరత ఏమీ లేదని, గ్యాస్ ఏజెన్సీలు తగినన్ని సిలిండర్లను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నాయని ఇఓ వికె శీనా నాయక్ స్పష్టం చేశారు. భక్తులకు అందించే ప్రసాదాల తయారీ మరియు నిత్య అన్నదాన వితరణ యధావిధిగా సాగుతున్నాయన్నారు. రాబోయే పండుగలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం తగినన్ని గ్యాస్ నిల్వలను సిద్ధం చేసుకుందన్నారు. గ్యాస్ సరఫరా విషయంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు
వేదోక్తంగా సూర్యఉపాసన
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం సూర్యోపాసన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ వైదిక కమిటీ, వేద పండితులు లోక కళ్యాణం కోసం, భక్తుల ఆరోగ్య ప్రాప్తి కోసం వేద మంత్రోచ్చారణల మధ్య సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు, నమస్కారాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
దుర్గమ్మవారి సేవలో హైకోర్టు జడ్జి: దుర్గమ్మవారిని రాష్ట్ర
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మెడమల్లి దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ అభివృద్ధికి విరాళం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అంబేద్కర్ కోనసీమ జిల్లా, కోమరిగిరిపట్నం గ్రామానికి చెందిన కొప్పాడి రమేష్, వారి కుటుంబ సభ్యులు రూ. 2,50,000 విరాళాన్ని అందజేశారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: