ఇంద్రకీలాద్రి : దుర్గమ్మవారి ఆలయంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ 22నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా (District Collector Lakshmi Shah) అధికారులను ఆదేశించారు. విజయవాడలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లాస్థాయి అధికారులతో మంగళవారం జరిగిన మొదటి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. పటిష్టమైన కమాండ్ కంట్రోల్రూంను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక యాప్, టెక్నాలజీ తో కూడిన డ్రోన్ల ద్వారా ఉత్సవ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించా లన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
అధిక సంఖ్యలో భక్తులు వస్తారని
ట్రాఫిక్ నియంత్రణకు, పారిశుద్ద్య నిర్వహణకు ప్రత్యేక యాప్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ప్రమాద నివారణకు తగినవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కొండచరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సి న జాగ్రత్తలు చర్చించారు. మూలా నక్షత్రం రోజున అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆమేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (Sri Durga Malleswara Swamy Temple) ఇఓ వికె శీనా నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ, ఆలయ అధికారులు, అదనపు డిప్యూటి పోలీస్ కమీషనర్, వెస్ట్ జోన్ ఏసిపి, దేవదాయ శాఖాధికారులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

దుర్గమ్మ ఆలయానికి భక్తుల విరాళం
దుర్గమ్మ ఆలయంలో జరిగే స్వర్ణతాపడంపనులకు విజయవాడకు చెందిన తులసీల వెంకటరమణ చౌదరి తమ కుటుంబీకులతో కలిసిరు.1,00,116ల విరాళాన్ని మంగళవారం అందిం చారు. విజయవాడకు చెందిర గుడిపాటి సుదర్శన్ రు.1,00,116ల విరా ళాన్ని మంగళవారం అందించారు. దాతలకు, వారి కుటుంబసభ్యులకు దుర్గ మ్మవారి దర్శనం ఏర్పాటుచేసిన అధికారులు, దుర్గమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం,మెమొంటోలు అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు.
ఇంద్రకీలాద్రి చరిత్ర ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై ప్రసిద్ధ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. పౌరాణిక కథనం ప్రకారం, ఇంద్రుడు ఈ పర్వతాన్ని కీళి (ఆధారం)గా నిలిపాడని, అందుకే దీనికి “ఇంద్రకీలాద్రి” అనే పేరు వచ్చింది. మహాభారత కాలంలో అర్జునుడు ఇక్కడ శివుని ఆరాధిస్తూ తపస్సు చేశాడని విశ్వాసం ఉంది. శివుడు అర్జునుని కృపతో పాశుపతాస్త్రం వరంగా ఇచ్చాడు. ఈ పర్వతం దుర్గామాత శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది, ప్రతి ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా లక్షలాది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు.
భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దుర్గ అమ్మవారి ఆలయం ఏది?
భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దుర్గ అమ్మవారి ఆలయంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న శ్రీ కనక దుర్గమ్మ దేవస్థానం ప్రసిద్ధి చెందింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Fertility Center : యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రానికి తాళాలు