📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Indrakeeladri: శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వేడుకగా దుర్గమ్మ ఆలయంలో మహాకుంభాభిషేక ఉత్సవాల సందడి

Indrakeeladri: అమ్మలగన్న అమ్మ, శ్రీ కనక దుర్గమ్మ ఆలయంలో (Sri Kanaka Durgamma Temple) ద్వాదశ వార్షిక (12 ఏళ్లకు ఒకసారి జరిగే) మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్రమైన ఆగమ శాస్త్రోక్త కార్యక్రమం, వేదమంత్రోచ్చారణలు, భక్తిశ్రద్ధల మధ్య మొదటి రోజు ఉదయం 7గంటలకు శ్రీ కనక దుర్గా నగర్ ప్రవేశ ద్వారం నుండి వేద పండితులు, అర్చకులు పవిత్ర కలశాలను తీసు కుని, ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఊరేగింపులో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇట కీనా నాయక్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, అమ్మవారికి కలశ సమర్పణ చేశారు. ఆనంతరం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ఆంకు రార్పణ, మంత్రపుష్పం, మూల మంత్ర హవనం నిర్వహించారు.

Read Also: Nimmala Rama Naidu: ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

Indrakeeladri: Sri Kanaka Durgamma Mahakumbhabhishek celebrations begin

సామాన్యులకు పెద్దపేట

మహాకుంభాభిషేకం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో, ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇది. చైర్మన్లు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు భక్తులను కోరారు. ఏర్పాట్లపై హర్షం: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల నేపథ్యంలో, రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు కనీస ఇబ్బంది కలగకుండా తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

భక్తులకు విస్తృత సౌకర్యాలు

నగరపాలక సంస్థ సహకారంతో భక్తుల దాహార్తిని తీర్చేందుకు లోబ్రిడ్జి నుండి ప్రారంభించి ప్రధాన దేవ స్థానం వరకు ప్రతి 100 మీటర్లకు ఒక తాగునీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీతమ్మ వారి పాదాలు, దుర్గా ఘాట్, ఘాట్ రోడ్, ప్రధాన ఆలయ పరిసరాలు, మహా మండపం, శివాలయం. ఇతర రద్దీగా వుండే 11 కీలక ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను, వైద్య నిపుణులతో అందుబాటులో ఉంచారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా మజ్జిగ మరియు బిస్కట్ ప్యాకెట్ల పంపిణీ జరుగుతోంది. ప్రత్యేకించి చంటి బిడ్డలకు, వృద్ధులకు పాలు పంపిణీ చేస్తూ సాయంత్రం వరకు కొనసాగించారు. అన్న ప్రసాద విభాగం ద్వారా భక్తులందరికీ రుచికరమైన అన్న ప్రసాదం వితరణ నిరంతరం కొనసాగుతోంది. కనకదుర్ల నగర్ ఎంట్రన్స్ నుండి మహా మండపం వరకు, అలాగే ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నుండి ప్రోటోకాల్ ఆఫీస్ వరకు క్యూ లైన్ల పొడవునా షామియానాలు/ టెంట్లు ఏర్పాటు చేశారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల దర్శన టిక్కెట్లను రద్దు చేసి, భక్తులందరికీ శ్రీ అమ్మవారి ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నారు. క్యూ లైన్లు త్వరగా కదిలేందుకు వీలుగా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇఓ వి.కె. శీనానాయక్ స్వయంగా కనకదుర్గ నగర్ వైపు ఉన్న క్యూ లైన్లలో పర్యటించారు. భక్తులతో నేరుగా మాట్లాడి అందుతున్న సౌకర్యాలపై వారి సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్స్కు ఇఓ దిశానిర్దేశం చేశారు. మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించి, సిసి టివిల ద్వారా భక్తుల కదలికలను పరిశీలించారు. ఏసిపి దుర్గారావుతో చర్చించి, భద్రత మరియు క్యూ లైన్ల క్రమబద్ధీకరణపై ఆదేశాలు జారీ చేశారు.

దుర్గమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణారావు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని బహుకరించారు.

సాయంత్రం ధర్మపథం వేదికపై జరిగిన వివిధ కార్యక్రమాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. విజయవాడకు చెందిన సప్ప శివకుమార్ బృందం మహా గణపతిం, అయిగిరి నందిని, వినాయక కౌత్వం, కొండలలో నెలకొన్న, జతిస్వరం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయక, జయ. జయ జనార్ధన వంటి కీర్తనలకు తమ అద్భుత కూచిపూడి నృత్యంతో భక్తులను అలరించారు.

అలరించిన భక్తిరంజని

కుసుమ, సంధ్య, శ్రీనివాస్, కె. జగన్మోహిని బృందం వినాయక, సంగీత సామ్రాజ్య సంచారిణి, హిమగిరి తనయే, కామాక్షి స్వరజతి, నను గన్న తల్లి, శంభో మహాదేవ, జయ జయ వైష్ణవి కీర్తనలను హృద్యంగా తమ గాత్ర మాధుర్యంతో భక్తులను మైమరపించారు. శ్రీ అమ్మవారికి కోలాట నీరాజనం: విజయవాడకు చెందిన శాంభవి కోలాటం బృందం ప్రదర్శించిన కోలాటం భక్తులలో ఉత్సాహాన్ని నింపింది. కుంభాభిషేక వేడుకల వేళ ఇంద్రకీలాద్రిపై వెల్లివిరుస్తున్న సాంస్కృతిక శోభ భక్తులకు మరువలేని అనుభూతిని మిగిల్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Indrakeeladri Kumbhabhishekam Kanaka Durga Temple Maha Kumbhabhishekam Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.