📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Indigo : ‘ఇండిగో’ పరీక్ష!

Author Icon By Sudha
Updated: December 6, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ విమానసర్వీసుల్లో నెలకొన్న అంతరాయం దేశవ్యాప్తంగా విమాన ప్రయాణీకులకు తీరని ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. చౌకధరల విమానయాన సంస్థగా పేరున్న ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థ నడుపుతున్న ఇండిగో విమానసర్వీసులకు తీవ్రస్థాయిలో అంతరాయం కలిగింది. అంతేకాకుండా నాలుగురోజులుగా వందలాది విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణీకులు ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు పడి వేచి ఉంటున్నా సమస్యకు పరిష్కారం లభించడంలేదు. ఎసిక్లాస్ ధరలతో విమానయానం చేయవచ్చని తలపోసిన ఎన్డీయే సర్కారు దేశంలోకి అనేక సంస్థలను ప్రోత్సహించింది. మరికొన్ని అయితే దేశీయ సంస్థలతో జతకట్టి మరీవచ్చాయి. మొత్తం చెక్ ఇన్ అయిన తర్వాత విమాన సర్వీసులు రద్దుచేస్తు న్నట్లు ప్రకటించడం అసహనం పెంచింది. సిబ్బంది కొరత, పైలట్లకు శిక్షణపై డైరెక్టరేట్ జనరల్
ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసిఎ విధించిన ఆంక్షలు వంటివి ఇండిగో (Indigo)సర్వీసులకు అడ్డంకులు తెచ్చిపెట్టాయని కంపెనీ వాదిస్తోంది. గడచిన నెలలోనే ఈసంస్థకు చెందిన మొత్తం 1232 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వివిధ విమానాశ్రయా ల్లోని పార్కింగ్ ప్రాంతాలను కూడా ఇండిగో విమానాలు ఆక్రమించుకోవడంతో ఇతర ఎయిర్లైన్క సైతం విపరీత జాప్యం కలిగింది. పైలట్లకు విశ్రాంతి, విధుల్లో నిబంధనల నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకూ మినహా యింపు ఇవ్వాలంటూ ప్రభుత్వం కోరింది. ఈలోపు సిబ్బంది కొరత, శిక్షణ పొందిన పైలట్లు రావడంలో జాప్యం వంటివి ఇండిగోకు తీరని నష్టాలు తెచ్చిపెట్టింది. ప్రణాళికా లోపాలవల్ల తగినంతమంది సిబ్బందిని రాబట్టుకోలేకపోయింది. దీనికితోడు ఇటీవల తరచూ జరుగు తున్న సాంకేతిక లోపాలు, విమాన ప్రమాదాలు, అత్యవ సర ల్యాండింగ్ సంఘటనలతో డిజిసిఎ విమానయాన సంస్థలకు ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీచేసింది. ఒక్క దేశీయ సర్వీసుల్లోనే ఇలా జాప్యం, లేదారద్దు చేయడం వంటివి సంభవించడం వ్యూహాత్మకంగానే జరిగాయని ప్రయాణీకులు ఆక్రోశిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటున్నందున ఆ సర్వీసులను మినహాయించి కేవలం దేశీయ సర్వీసులపైనే విధించడం కంపెనీ వ్యూహాత్మక చర్యలేనన్న ప్రయాణీకుల ఆరోపణ లకు ఇండిగో జవాబుదారీ కాలేకపోయింది. రానురాను ఇండిగో సర్వీసుల సమస్య ప్రస్తుత శీతాకాల సమావేశాలను కూడా కుదిపేసేస్థాయికి చేరింది. హోంమంత్రి, పౌరవిమానయాన మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిం చినా పరిస్థితిలో మార్పులు రాలేదు. గడచిన నాలుగు రోజుల్లోనే 550కిపైగా విమానసర్వీసులు అప్రకటితంగా రద్దుచేయడంపై ప్రజాప్రతినిధులు సైతం జవాబుదారీ కావాల్సి వస్తోంది. పౌరవిమానయాన చరిత్రలో ఇంతభారీ ఎత్తున విమానసర్వీసులు రద్దుకావడం ఇదే ప్రథమం. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎల్డీఎల్) నుంచి ఉపశమనం కావాలని మొదటినుంచి ఇండిగో పట్టుబడుతోంది. పైలట్ల కు విశ్రాంతి సమయం 36నుంచి 48 గంటలకు పెంచిం ది. ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్ను సెలవుగా పరిగణిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటించింది. అయితే ఎఫ్టిటిఎల్ ప్రకారం వీక్లీ రెస్టుసెలవుగా పరిగణించడానికిలేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, సెలవులు వేరువేరుగా చూస్తారు. పైలట్ల అలసట సమస్య పరిష్కారానికే డిజిసిఎ ఈ కఠిన నిబంధనలు తెచ్చింది. అలాగే పైలట్లు వరుసగా రెండుకంటే ఎక్కువ రాత్రి షిప్టు పనిచేయకూడదన్న నిబంధనను ప్రస్తుతం పక్కన
పెట్టింది. ప్రతి పక్షం రోజులకు ఒక పర్యాయం నిబంధ నలు సమీక్షించే డిజిసిఎ కొంతమేర దిగివచ్చినా పరిస్థితు ల్లో మార్పురాలేదు. దేశీయ సర్వీసుల్లో గిట్టుబాటు కావ డం లేదన్న సాకుతో సర్వీసులు, నిబంధనల పేరిట వంద లాది సర్వీసులు రద్దుచేసారని ప్రయాణీకులు చెపుతున్నారు. ఇండిగో ప్రభావం ఇప్పుడు దేశంలోని మెట్రోనగరాలు సర్వీసులపై పడింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్, లక్నో, హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రయాణీకులకు తీవ్ర అసహనం రేకెత్తిస్తోందనే చెప్పాలి. రౌండ్ట్రాప్ టికెట్ ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపో యాయి. రూ.20 వేలనుంచి ఏకంగా రౌండ్ప్ ఏకంగా రూ. 92 వేలవరకూ ఉంది. ఇండిగో ( Indigo)వెబ్సైట్నుపరిశీలిస్తే సుమారు 2200 సర్వీసులవరకూ నడుపుతోంది. దిగ్గజ సంస్థ ఎయిరిండియా కంటే రెండురెట్లు ఎక్కువే. ఈ కంపెనీకి సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొత్తరోస్టరి నియ మాలు వంటి వాటితో సతమతమవుతోంది. ఇండిగో పరి స్థితి శీతాకాల పార్ల
మెంటు సమావేశాల్లో విపక్షాలకు పెద్ద అస్త్రం లభించినట్లయింది. ప్రభుత్వరంగ గుత్తాధిపత్యమే కారణమంటూ విపక్షనేతలు అస్త్రాలుసంధిస్తున్నారు. విమా నయాన సంస్థల్లో కేవలం ఒక్క ఇండిగోకు మాత్రమే ఈ సమస్య ఎందుకు వచ్చింది. నిన్నమొన్నటివరకూ విండోస్ బ్రేక్ డౌన్ కారణంగా ప్రధాన ఎయిర్పోర్టుల్లో సర్వీసులు స్తంభించిపోయాయి. ఈ సమస్య నుంచి గట్టెకుతున్న తరు ణంలో కేవలం ఒక్క ఇండిగోలోనే వందలాది సర్వీసులు నిలిచిపోవడం దేశంలోని 50శాతానికిపైగా ప్రయాణీకుల కు అపారనష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. ప్రభుత్వపరంగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలే ఇందుకు కారణమా? విమానసంస్థల మధ్య నెలకొన్న పోటీ, గుత్తాధిపత్యమే కారణమా? లేక ఏదైనా కుట్రకోణం ఉందా? లేక సిబ్బంది కొరత ఆ సంస్థను పట్టిపీడిస్తోందా అన్న అంశాలపై ఇప్పటికీ స్పషతరాలేదు. ఆలస్య మైనా ప్రభుత్వం స్పందించి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశిం చడం కొంత ఊరటనిచ్చే అంశం. అలాగే పూర్తిస్థాయిలో కంట్రోల్ రూమ్ను కూడా ప్రారంభించి తక్షణ పరిష్కా రానికి పూనుకోవడంద్వారా విమర్శల నుంచి తప్పించుకో గలిగిందని భావించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News diagnostic test health test indigo test latest news medical insights Telugu News wellness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.