Telugu News: Indian Railways: ఈ నెల 20న దువ్వాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

Read Time:  1 min
Indian Railways
Indian Railways
FONT SIZE
GET APP

విజయవాడ: Indian Railways ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విజయవాడ–దువ్వాడ సెక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్న కారణంగా ఈ నెల 20వ తేదీన (సోమవారం) నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను(Express trains) రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

 Read Also: Vande Bharat: రైల్లో స్నానాకి వేడి నీళ్లు రెడీ

Indian Railways
Indian Railways

నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, రద్దయిన రైళ్లు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో ఆటోమేటిక్ సెక్షన్ ప్రారంభం కోసం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ముఖ్యంగా తుని, హంసవరం, అన్నవరం, రావికంపాడు స్టేషన్ల మధ్య ఈ పనులు జరుగుతున్నాయి.

ఈ నెల 20న రద్దు అయిన రైళ్లు:

  • కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17267)
  • రాజమండ్రి – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (67285)
  • విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ (17268)
  • విశాఖపట్నం – రాజమండ్రి ఎక్స్‌ప్రెస్ (67286)

ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

రైల్వే సర్వీసులు ఎందుకు రద్దు అయ్యాయి?

విజయవాడ – దువ్వాడ సెక్షన్‌లో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు, నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున రద్దు అయ్యాయి.

రైళ్లు ఏ సెక్షన్‌లో రద్దు అయ్యాయి?

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ–దువ్వాడ సెక్షన్ మధ్య రద్దు అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.