📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IndiaAI ImpactSummit: ఢిల్లీ ఎఐ సదస్సుకు సిఎం

Author Icon By Pooja
Updated: February 20, 2026 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేడు పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి భేటీ

విజయవాడ : IndiaAI ImpactSummit: అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు హాజరు కానున్నారు. ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొనున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్న సీఎం భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ వేదికకు వెళ్లనున్నారు. 9.30 గంట లకు ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొ నున్నారు.

Read Also:Vangalapudi Anitha: జగన్‌పై మంత్రి అనిత సెటైర్

IndiaAI ImpactSummit: CM to attend Delhi AI Summit

అనంతరం రాష్ట్రంలో ఏఐ మోలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి
కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చు కోనుంది. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసీసీ సంస్థతోనూ ఒప్పందం జరుగనుంది. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎస్ఐఐటీ తోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటీ మద్రాస్ కూడా ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్విడియా భాగస్వా మ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయ నున్నారు. అనంతరం క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మద్యాహ్నం 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గోనున్నారు.

కృత్రి కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ సదస్సులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండే తో కలిసి ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మద్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ప్రతినిధి బృందంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. బ్రిటన్ ఏఐ, ఆన్ లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క నారాయణ్, భారత్ లో యూకే హై కమిషనర్ లిండి కెమరాన్, వాతావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సెలర్ శాలీ టేలర్ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. మద్యాహ్నం 3 గంటలకు ఆరామ్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ అయితుకైర్, అడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే తో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశం కానున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి బయల్దేరి రానున్నారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఎఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ సాయంత్రం సీఎం జైపూర్ కు బయల్దేరి వెళ్ళారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి జైపూర్ కు బయలుదేరి వెళ్ళారు.. జైపూర్ లోని వృందావన్ ప్యాలెస్ లో జరిగే వివాహానికి హాజరై రాత్రికి అక్కడే బస చేస్తున్నారు.. శుక్రవారంఉదయం జైపూర్ నుంచి బయల్దేరి ఢిల్లీలో జరిగే ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ArtificialIntelligence Google News in Telugu Latest News in Telugu TechHubAP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.