📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

India : దేశంలో ‘స్వచ్ఛ’ రాజకీయాలు అవసరం

Author Icon By Sudha
Updated: February 16, 2026 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజకీయాలు రంగుల రాట్నంగా మారాయి. కుదురుగా ఒక పార్టీలో ఉండే వాళ్లు అరుదయ్యారు. చక్రంలో రంగు ఎటు కనపడితే అటు దూకే పరిస్థితి ఏర్పడింది. కొన్ని సంవత్సరాల క్రిందట దేశంలో స్వతంత్ర గాలులు వీచిన వేళ పార్టీలు మారటం నేరం కన్నా నామర్ధాగా భావించేవారు. రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీని ఏర్పరిచిన కారణం అప్పటి ప్రధాని అధికారంలో ఉన్న పార్టీ మీద అలిగి కానీ, కోపంతో కానీ కాదు! బలమైన ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం దారి తప్పదు అన్న ఏకైక సూత్రంతోనే ఆయన పార్టీని పెట్టారని అప్పటి వారు ఆ రోజుల్లో జ్ఞాపకం చేసుకొనేవారు. ఆయన పార్టీ నడిపినంత కాలం ప్రతిపక్షం నిర్మాణాత్మకంగానే వ్యవహరించింది. ప్రతిపక్ష ప్రభావం ఎలా ఉండేదంటే నేను ఏ తప్పు చేస్తానో, చూసి సరిదిద్దడానికి దక్షిణ దేశంలో ఒకాయన ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాడు. నేను మాత్రం సాధ్యమైనంతవరకూ ఆ అవకాశం దక్కనివ్వను అని నెహ్రూ అనేవారని ఆ రోజుల్లోని రాజకీయాల వ్యవ హార శైలి తెలిసిన వారు చెప్పేవాళ్లు. అవన్నీ ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. (ఓల్డ్ గార్డ్ రూం ఈజ్ ఎంప్టీ నౌ గాడ్ సేవ్ ది నేషన్) జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన మరుక్షణమే రాజాజీ ఆ విధంగా వాపోయి నివాకులర్పించారు. అదీ వారి సాన్నిహిత్యం! వ్యక్తుల మధ్య స్నేహం అలాగే ఉండేది. సమస్యలు మాత్రమే విబేధాలకు కారణమయ్యేవి. విరోధాలకు కాదు! ఎక్కడో లోక్సభలో వెనక బెంచీలో ధారావాహికంగా మాట్లాడుతున్న అప్పటి ప్రతిపక్షంలోని నాయకుడు అటల్ బిహారీ వాజ్పాయ్ని చూసి ఎప్పుడో ఒకప్పుడు ఆ యువకుడు ఈ దేశానికి ప్రధాన మంత్రికాగలడు అని అప్పటి ప్రధాని జవహర్లాల్ భవిష్యత్ వాణిని వినిపించారట! అన్ని పార్టీలను కూడదీసి, ఎమర్జెన్సీ విధించినందుకు గాను, పెద్ద యుద్ధమే చేసిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ దగ్గరకు ఓడిపోయిన ఇందిరాగాంధీ ఓదార్పు కోసం ఆశ్రయం కోరి అక్కడ కొద్ది కాలం గడిపిందని చరిత్ర చెబుతున్నది.

Read Also: http://Lok Sabha Speaker: మార్చి 9న స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ

India

తిట్ల పురాణం

ప్రధాని పి.వి నర్సింహారావు ప్రత్యేకంగా ప్రతిపక్షంలోని వాజ్పాయు భారతదేశ ప్రతినిధి వర్గానికి నాయకుడిగా, మనదేశానికి ప్రాతినిధ్యం వహించటానికి సగౌరవంగా పంపిన విషయా న్ని ఇప్పటికీ దేశంలోని పార్టీల మధ్య అంశాలను బట్టి విబేధాలు ఉండొచ్చు కానీ విరోధాలు ఉండకూడదు అని అనుకొనే విజ్ఞులు, నెమరు వేసుకుంటూనే ఉంటారు. అంతెందుకు ప్రధానమంత్రి వాజ్పాయ్కి సెంట్రల్ హాల్లో జవహర్లాల్ ఫొటో గోడమీద కనపడకపోయేసరికి అంతు లేని కోపం వచ్చిందట. ఆ ఫొటోను గోడకు తగిలించేంత వరకూ ఆయన ఊరుకోలేదని లోక్సభలోని అధికారులు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఈ సాంప్రదాయాలు ఎక్కడికి పోయాయి? రాజకీయాలంటే నీచమైన తిట్ల పురాణం విప్పి, మహిళలను కూడా వినరాని, వినలేని పదజాలంతో తిట్టటమేనా? చీటికి మాటికి ప్రజల విషయాలు కాకుండా నువ్వింత అంటే నేనంత అని బజారు భాషను జాతీయ భాషగా మార్చి వీధికుళాయి తగాదాలు మాదిరి పవిత్రమైన అసెంబ్లీలలో పార్లమెంట్లో కూడా ఉచ్చనీచాలు మరిచి ‘వ్యక్తిగత ద్వేషాలతో ఇట్ల వస్త్రాలు ఉతికి నడిబజార్లో ఆరేసు కోవటమేనా? ఆధునిక యుగం డిజిటల్ యుగం, అంతరిక్ష యుగం పరిశోధనలో అత్యంత వేగవంతంగా అన్ని రంగా ల్లోనూ
పురోభివృద్ధి సాధించామని మనదేశమే కాదు, అన్ని దేశాలు కూడా రొమ్ము విరుచుకొని చెబుతున్న ఈ కాలంలో ఇదెక్కడి వైపరీత్యం? మానవ సంబంధాలలో ఇంత అట్టడుగుకు ఎందుకు దిగజారారు? నైతికతను పాతరేసి అవ కాశ రాజకీయాలు, ఎన్నికల రాజకీయాలు సాగించడానికి ఏదో విధంగా గెలుపుగుర్రాన్ని అధిరోహించి ఎన్నుకున్న జనాల మీదనే స్వారీ చేయటానికా? సోవియట్ రష్యా ముక్కలయింది. రష్యా, ఉక్రెయిన్ల పోరు మొదలైంది.

India

చీలిన దేశాలు

పాకిస్థాన్ రెండుగా చీలి బంగ్లాదేశ్ ఉద్భవించింది. ఇప్పుడి ప్పుడే బలూచిస్థాన్, పాకిస్థాన్లోని అంతర్భాగంలో నిప్పు రాజుకొంది. ఒకప్పటి పాకిస్థాన్ లోని ఈ మూడు ప్రాంతా లలో నిప్పు సెగంటుకొని, జ్వలలు చేస్తున్నాయి. భారత్ (India)పాకిస్థాన్ విడిపోయిన తర్వాత చరిత్రలోని మలుపు ప్రపంచ మంతటా యు.ఎన్. ఓతో సహా అందరికీ తెలిసినదే. అత్యం త సుందర ప్రదేశం కాశ్మీర్ను ఇండియాలోని అంతర్భా గాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకోటానికి చేస్తున్న యుద్ధాలు కొత్తగా ఉగ్రవాద అస్త్ర ప్రయోగాలు జగమెరిగిన సత్యమే. తాలిబన్లను దగ్గరకు తీసి ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన పాకి స్థాన్కు తాలిబన్లే బుద్ధి చెబుతున్నారు. అఫ్ఘానిస్థాన్ రాజ్యా ధికారాన్ని హస్తగతం చేసుకొని పాకిస్థానైనే పంజా విసర టానికిసిద్ధంగా ఉన్నారు. హిందీ- చీనీ భాయి, భాయి అన్న చైనా నక్క జిత్తుల ప్రయోగం ఇండియా ముందు పనికి రాలేదు. దొంగచాటుగా, మరో విధంగా సరిహద్దు సమస్య లు సృష్టించి భారతన్ను చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నిం చిన ఆ దేశానికి భారత్ (India)మింగుడుపడలేదు. చేసేదిలేక ప్రస్తుతం అనుకూల శత్రువుగా మారింది. యుఎస్ అధ్య క్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండవసారి ఎన్నిక కాగానే టక్కుట మార విద్యల ప్రావీణ్యత ప్రదర్శించటంతో దాదాపు అన్ని దేశాలూ ముక్కున వేలేసుకున్నాయి. అయితే ట్రంప్త న దేశంలోని అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం పెట్టి తరిమేసే కార్యక్రమంతోపాటు, తమ దేశంలోని ఉద్యోగా లన్నీ ఇతర దేశస్థులు వలసదారులుగా మారి లబ్ధిపొంద టంతో తన దేశ బాగుకోసం, కఠినతరమైన నిబంధనలలో, ఆర్థికపరమైన కొత్త నిబంధన ‘టారిఫ్’ అనే ఆయుధాన్ని వదిలాడు. ఆ దెబ్బకు చాలా దేశాలు దిగొచ్చాయి. పాలస్తీనా, ఇరాన్, మలేసియా, చైనా, భారత్ దేశాలను అనుకూలంగా మార్చుకోటానికో, తన పాలన పటిష్ట పర్చుకోటానికో అనేక రకాల ప్రయోగాలు చేస్తున్న నేపథ్యంలో భారత్ ఒక ఇంటరీం ఎగ్రిమెంట్ కుదుర్చుకొని ఆర్థికంగా కొంత ఊరట పొందే ప్రయత్నంలో ఉన్నది. అంతర్జాతీయంగా కూడా స్నేహం, నైతికతలకు తిలోదకాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న తరుణంలో మనదేశం ఆధ్యాత్మికతకు ఆదర్శప్రాయం గా ఉన్న దేశం నైతిక మార్గాన్ని చూపక తప్పదు. మనదేశం ఈవిధంగా విలువలకు ప్రాతినిధ్యం ఇచ్చే అడుగులు వేయా లంటే మన ఇంట్లోనే అడుగుజాడలు సరిగ్గా ఉండేట్లు చూడక తప్పదు. రాజకీయాలు ఉండకతప్పదు. ప్రజాస్వా మ్యంలో రాజకీయం ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ రాజకీయాలంటే ప్రజల పురోగతి కోసం ప్రజాసేవ కోసం అనుసరించే మార్గం. తిట్లకూ శాపనార్థాలకూ వ్యక్తుల వివా దాలను రాజకీయ వివాదాలుగా మార్చి కుల, మత, ప్రాంతీ యతలను ఆపాదించి, అసలుకే ఎసరు పెట్టటంకాదు. ప్రజల కోసం రాజకీయం స్వచ్ఛంగా చేయాలి. స్వయం సంపాదన కోసం చేసేది రాజకీయం కాదు. అరాజకీయం.


-రావులపాటి సీతారాం రావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

anti corruption Breaking News Clean Politics Good Governance india latest news political reforms Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.