📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: India:భవిష్యత్తులో భారతదేశం అంతరిక్షంలో నంబర్ వన్గా ఉండాలి

Author Icon By Pooja
Updated: October 11, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బొబ్బిలి (విజయనగరం జిల్లా) : భవిష్యత్తులో భారతదేశం(India) అంతరిక్షంలో ప్రపంచ పటాలలో నెంబర్ వన్గా ఎదగడానికి వడివడిగా అడుగులు వేస్తున్నామని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మూడవ లాంచ్ డైరెక్టర్ పి.శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అంతరిక్ష వారోత్సవాలు(Space Week celebrations) ముగింపు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూమికి అతీతంగా జీవించగలిగే మనిషి అంతరిక్షంలో కూడా జీవించడానికి భవిష్యత్తును ఉత్తేజపరిచే కార్యక్రమాలపై మన సైంటిస్టులు పరిశోధనలు జరుపుతున్నారని అన్నారు.

Read Also: TG Govt: బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

దేశానికి(India) యువశక్తి కృషి ఎంతైనా ఉందని శాస్త్ర పరిశోధనా రంగాలలో మరింత లోతైన అధ్యయనం సాధించే విధంగా విద్యార్థులు ఇప్పటి నుంచే భవిష్యత్ ప్రణాళికలు వేసుకొని అంతరిక్షంలో మనిషి జీవన విధానం పూర్తిస్థాయి అధ్యయనం సాగించిన నాడే ప్రపంచ పటంలో మన దేశం అత్యున్నతంగా నిలబడే రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగానికి మన వంతు కృషి చేసినప్పుడే అంతరిక్షాన్ని శోధించడం అంత కష్టమేమి కాదని అన్నారు. నాడు ఆకాశం పైకి వెళ్ళడానికి సాహసించాం నేడు దాని వెనుక ఏముందో శోధిస్తున్నామని అన్నారు. మనిషి జీవనానికి ఇక్కడ యోగ్యత ఉందా లేదా అన్న అంశంపై కృషి చేస్తున్నామని అన్నారు. చంద్రయాన్ మంగళయాన్ మిషన్ ద్వారా రెడ్ ప్లానెట్కు చేరి భారత్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఆదిత్య ఎల్ వన్ సూర్యుడిని పరిశోధించి భూమిని రక్షించడానికి దోహద పడిందన్నారు. ఈ నెలాఖరకు గగనయాన్ ప్రయోగం జరుగుతుందని దానికి ముమ్మర పనులు సాగుతున్నాయని దీనిద్వారా దేశానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనలు ప్రపంచానికి తెలిసే విధంగా సాగుతున్నాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

India Space Program ISRO Latest News in Telugu space mission Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.