📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

India : ఏఐకి భారత్ చుక్కాని?

Author Icon By Sudha
Updated: February 19, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమంటే మాటలా? కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అదే పనిలో ఉంది. ఎంతో వేగవం తంగా మార్పులు చెందుతూ భవిష్యత్ ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని భయపెడుతున్న తంత్రం ‘కృత్రిమ మేధ’. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ విప్లవం ఒకే రంగానికే పరిమితం కాలేదు. అన్ని రంగా ల్లోకి చొచ్చుకుపోతోంది. భారతదేశ (India)దార్శనికతను ఆవిష్క రించే ప్రయత్నంలో భాగంగా గత రెండు రోజులుగా ఇండియా ఎఐ ఇంపాక్ట్ 2016 సమిట్ జరిగింది. ఎన్నో దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు సమస్త ప్రపంచానికీ అర్థమయ్యే రీతిలో ఎఐ ప్రభావంతమైన అంశాలను క్రోడీ కరించి సదస్సు ముందుంచారు. భారత్ తన ఎఐమౌలిక సౌకర్యాలను బలోపేతం చేయాలన్న దృష్టిలో ‘ఏఐ ఇండియా వన్’ అనే సూపర్ కంప్యూటర్ రూపకల్పన దిశగా ప్రణాళిక బద్ధ చాతుర్యాన్ని ప్రకటించింది. కృత్రిమ మేధను నైతికంగా అభివృద్ధి చేయడమొక్కటే ప్రపంచ యవనిక మీద ముఖ్యాంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అందుకోసం భారత్ ఒక నిర్దిష్టమైన ఆలోచనలు చేస్తోంది. భారత్ను ఎఐ వినియోగదారుగా కాకుండా ఎఐ సృష్టికర్త గా మార్చాలనే ఆశ, ఆకాంక్షలను ప్రధాని సమ్మిట్లో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ఎన్నోదేశాల ఎఐ మేధావులు పాల్గొన్న సభలో భారత్ నేతలు ఎంతో గంభీరంగా ప్రక టించారు. ఎఐ విప్లవంలో భాగస్వామిగానే కాకుండా మానవ సామర్థ్యాన్ని అసాధారణ రీతిలో కృత్రిమ మేధ రూపొందిస్తున్నా రానురాను ‘కంప్యూటర్లలో హ్యూమన్ టచ్ మాయమైపోతుందన్న హెచ్చరికలు ఎల్లడలా ఆశ్చర్య పరుస్తుతున్నాయి. గత కొంతకాలంగా ఎఐ సాంకేతిక గూర్చి పూర్తి అవగాహన ఉన్న మేధావులు ఎఐ కారణం గా ఎన్నో మానవ వనరులకు పని లేకుండాపోతుందనే హెచ్చరికలున్నాయి. వాటిని తట్టుకుని నిలబడే ప్రత్యా మ్నాయాలపై కృత్రిమ మేధ అనుచితంగా దుర్వినియోగ పరిచే స్థితిని ఎలా కట్టడి చేయాలన్న అంశంపై తీవ్ర చర్చ జరిగింది. తాజాగా ఇండియా ఎఐ సదస్సు భిన్న ఆలోచనలు విభిన్న ఇన్నోవేషన్ల కూడలిగా మారింది. ప్రధాని ‘ఎక్ పోస్టులో ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఎఐని బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం ద్వారా మానవ ప్రగతికి బాటలు వేయడంలో భారత్ (India)చిత్తశుద్ధిని అవలంబించాల్సి ఉంది. ఎఐ సృష్టిలో స్మార్టు, పరి శోధనా సంస్థ,సాంకేతికవ్యవస్థల రూపకల్పనకు మౌలిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ కృత్రిమ మేధలో సృష్టించబడే అనుచిత, అసంకల్పిత వ్యవస్థలను ఎలా కట్టడి చేయాలో తెలియని అస్పష్టతతో గందరగోళప డుతోంది. సరైన మార్గనిర్దేశకత్వం లేకుంటే సామాజిక పునాదులకే ఎఐ సవాల్ విసురుతుందన్న విషయం సర్వవిదితమే. అన్ని రంగాల్లో ఎఐ ప్రభావం గణనీయం గా కనిపిస్తోంది. ఆరోగ్య వ్యవసాయ రంగంలో ఇప్పటికే కృత్రిమ మేధ సహాయంతో అద్భుతాలు జరుగుతున్నా యి. ఇవి భారత్లో కళ్లెదుట కన్పిస్తున్నాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యసాధనకు ఎఐ అతి కీలకంకానుంది. దేశంలో పట్టణ, గ్రామీణ అంతరాలను తగ్గించి అందరికీ సమానావకాశాల కల్పనకు దోహదం చేయడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధ్యమై మానవ, వికాసం కల్గుతుందని వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. భారత్ విషయా నికి వస్తే ఆరోగ్యరంగంలో ప్రాథమిక జిల్లా, కేంద్రాల్లోని వైద్య కేంద్రాల్లో పలు వ్యాధుల ముందస్తు గుర్తింపు విష యంలో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఆరోగ్యా భ్యుదయాన్ని పెంపొందిస్తున్నాయి. దీని పర్యవసానంగా జనంలో రోగనిరోధకత స్థాయిలు పెరుగుతాయి. విద్యా రంగంలో విద్యార్థుల మనోవికాసానికి బాగా ఉపయోగప డుతున్నాయి. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సజావుగా చేరుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల పారదర్శకత పెంపు లో ప్రాధాన్యత కలిగిన సేవలను అందుకోగలుగుతున్నా ము. ప్రాచీన రాత ప్రతుల డిజిటలీకరణ వంటి అంశాలో భారతీయ వారసత్వ సంపద సంరక్షణలో కీలక పాత్ర వహిస్తోంది. ఇవన్నీ తెలిసినవి. తెలియని వైవిధ్యతలు ఎన్నెన్నో ఉన్న రోజుల్లో కృత్రిమ మేధ వ్యాప్తి అంతుపట్ట లేని ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధ సదస్సు జరుగుతున్న తరుణంలో అనేక వికారాలు కూడా బయటపడుతున్నాయి. సుప్రీం కోర్టులో ఎఐ టూల్స్ రూపొందించబడిన ఓ పిటిషన్ విషయంలో న్యాయమూర్తులు తల్లడిల్లిపోయారు. అవాంఛ నీయ కాల్పనిక తీర్పులను ఉదహరిస్తూ తయారైన పిటి షన్లను చూసి ఆవేదన వ్యక్తంచేశారు. మానవ మేధస్సు నుపయోగించే కళ తగ్గిపోయిందని వాపోయారు. ఇలాంటి అవాంఛితాలను కట్టడి చేసే విషయంలో మానవ మేధ స్సుకు పదునుపెట్టాల్సిన అవసరం ఏమాత్రం తగ్గిపో లేదు. అంతేతప్ప అన్నీకృత్రిమ మేధతోనే జరుగుతాయని, మనం చేసే పని ఏమీ ఉండదని మానవుల్లో అభిప్రాయం కలిగితే జాతి నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. ఎఐ మానవ సామర్థ్యాలను ఎంత మెరుగుపరి చినా అత్యంత కీలకమైన తుది నిర్ణయాధికారం వ్యక్తుల దగ్గరే ఉండాలి. డిఫ్ఫక్ వీడియోలపైన ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఐతోసృష్టించే ఎలాంటి కంటెంట్ కైనా డేటా రక్షణ వాటిజాగ్రత్తలు అవసరమంటున్నారు. ఢిల్లీలో జరిగిన ఎఐ సదస్సుకు సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అనే థీమ్తో ప్రపంచ మానవాళి సౌఖ్యానికి ఎఐపురోగమనాన్ని స్వాగతించదగిన పరిణామం. ప్రపంచ భవితకు ఎఐ అనే వాదంతో ఈ సమ్మిట్లో పాల్గొంటారు. కనుక భారత్ లక్ష్యం నెరవేరినట్లే!

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AI Leadership Artificial intelligence Breaking News Digital India india latest news Technology Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.