IND vs PAK: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా కొలంబో ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ – పాక్ మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ సూర్య వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను కేవలం 114 పరుగులకే భారత్ ఆలౌట్ చేసి 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Read Also: Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది
ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ అవార్డ్ స్వీకరణ సందర్భంగా మాట్లాడిన ఇషాన్ కిషన్.. తన బలాన్ని నమ్ముకొని బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు. ‘ఈ వికెట్ బ్యాటింగ్‌కు అంత ఈజీగా లేదు. కొన్నిసార్లు మన బలాన్ని నమ్ముకొని ఏకాగ్రతతో ఆడాలి. నేను కేవలం బంతిని గమనిస్తూ.. నా బలానికి తగ్గట్లు ఆడాను. నా ఆఫ్-సైడ్ గేమ్ మీద నేను చాలా
కసరత్తు చేశాను.
ఎక్స్ వేదికగా సూర్య సేనపై ప్రశంసలు కురిపించాడు. నారా లోకేష్.
ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది
అందుకే బౌలర్లు నా ఏరియాలో బౌలింగ్ చేసేలా చేయగలిగాను. మైదానం పెద్దది కావడంతో గ్యాప్‌లు ఎక్కువగా దొరికాయి. గ్యాప్ షాట్స్ ఆడుతూ క్విక్ డబుల్స్ తీయడానికి ప్రయత్నించాను. 160-170 పరుగులు మాకు మంచి స్కోరు అని తెలుసు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే. అది కేవలం మాకే కాదు యావత్ దేశానికి ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యమైనది. పాక్ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు. పాకిస్థాన్‌పై సాధించిన ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
ఇక బుమ్రా, హార్దిక్ విషయానికొస్తే.. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పేసర్లకు పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించినట్లు అనిపించలేదు. కానీ బుమ్రా కొత్త బంతితోనైనా, డెత్ ఓవర్లలోనైనా ఎలా బౌలింగ్ చేయగలడో అందరికి తెలుసు. అలాగే హార్దిక్ తన ప్రణాళికలను చక్కగా అమలు చేస్తూ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. ఈ గెలుపులో అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.’అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: