Kodali Nani : కొడాలి నాని ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ముంబ‌యికి త‌ర‌లింపు !

Read Time:  1 min
Important announcement on Kodali Nani health.. Transfer to Mumbai!
Important announcement on Kodali Nani health.. Transfer to Mumbai!
FONT SIZE
GET APP

Kodali Nani: ఈ నెల 26న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడాలి నాని హార్ట్ ఎటాక్‌ కు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ప్రస్తుతం నగరంలోని ఏఐజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అయితే, నాని తాజా హెల్త్ కండీషన్‌పై ఏఐజీ వైద్యులు ఇవాళ ఉదయం బులిటిన్ విడుదల చేశారు. కాసేపట్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నాని గుండెలో మొత్తం 3 వాల్స్ క్లోజ్ అవ్వడంతో క్రిటికల్ సర్జరీ చేసి హార్ట్ స్టంట్ లేదా బైపీస్ సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించామని వారు తెలిపారు.

కొడాలి నాని ఆరోగ్యంపై కీల‌క

మెరుగైన చికిత్స కోసం ముంబ‌యికి

దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబ‌యిలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా సమచారం. కాగా, మార్చి 27, 2025న వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా కొడాలి నానిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏఐజీ వైద్యులు ఆయనకు గుండె సంబంధిత అసాధారణతలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా గుండెపోటు అని నిర్ధారించలేదు. కొన్ని వార్తా సంస్థలు సర్జరీ అవసరం కావచ్చని పేర్కొన్నప్పటికీ, ఈ విషయంలో అప్ప‌టికి స్పష్టత రాలేదు.

ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు

ఇక, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టైన తర్వాత విజయవాడ జైలుకు తరలించగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశీని పరామర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో కొడాలి నాని జైలు దగ్గరకు జగన్‌తో కలిసి వచ్చారు. అలాగే గుంటూరు మిర్చియార్డుకు వైఎస్ జగన్ వచ్చిన సమయంలో కూడా నాని అక్కడికి వచ్చారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.