हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Technical tools : పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

Sudha
Latest Telugu News : Technical tools : పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

మానవ జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు నిత్యంపూజ్య నీయులు. ప్రతీ వ్యక్తికి తల్లిదండ్రులే దైవ స్వరూపా లు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మన ప్రగతికి పరితపిస్తూ, అవిశ్రాంతంగా పనిచేస్తుంటారు. మన అభ్యు న్నతి కోసం వారు తమ సమయాన్ని, శ్రమను ధారపోస్తారు. పిల్లలు సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేయడం వారికి పరిపాటి. వారు కోరుకునేది కేవలం మన అభ్యున్నతి మాత్రమే. ప్రతీ వ్యక్తి ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. నేటి తరం సాంకేతికంగా ముందుకెళుతోం ది. అదే సమయంలో మారుతున్న సమాజ పోకడలు, సాంకేతిక విస్తృతి పెను సవాళ్లను విసురుతోంది. నిర్మల మనస్సుతో సమాజంలోకి అడుగుపెడుతున్న బుడతలు తమకు తెలియకుండానే విషవలయంలో చిక్కుకుంటున్నారు. మంచి, చెడులను తెలుసుకునే వయస్సులోనే చెడువైపు ఆకర్షితులైపోతున్నారు. కుటుంబాలు చిక్కిపోవడం, తల్లి దండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు కూడా దీనికి కారణంగా మారుతున్నాయి. వారు తగినంత సమ యం చిన్నారులకు కేటాయించలేని పరిస్థితులు, వృత్తిపరమైన ఇబ్బందులు వారిని కొంత సంకట స్థితిలోకి నెట్టేస్తు న్నాయి. అదే సమయంలో చిన్నారులు టెలివిజన్లు, సెల్ ఫోన్లకు అలవాటు పడి, మెల్లగా బానిసలుగా మారిపోతున్నారు. ఆట పాటలకు స్థలం లేకపోవడం, స్నేహితుల సంఖ్య తగ్గిపోవడంతో వీరు తమకు తెలియకుండానే ఎల క్ట్రానిక్ వస్తువుల (Technical tools)వలయంలో చిక్కిపోతున్నారు. అదే సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ప్రతీ ఇంటిలో స్మార్ట్ ఉపకరణాలు(Technical tools) పెరగడం కొంత మేలు చేస్తున్నా తెలియకుండానే ఎంతో విషాన్ని చిన్నారులలో నింపేస్తున్నాయి. కుటుంబంతో సంబంధం లేనంతగా చిన్నారులు వీడియో గేమ్లకు అలవాటు పడటం ఇటీవల అధికంగా కనిపిస్తోంది. ఇటువంటి వ్యక్తులలో మానవ సంబంధాలు పూర్తిగా మందగించడం, వివరీత ధోరణులు, క్రోధ ప్రవృత్తి పెరిగిపోతున్నాయి.

Read Also: http://Naegleria fowleri: కేరళను వణికిస్తున్న కొత్త వ్యాధి.. ఎలా వస్తుందో తెలుసా..?

Technical tools
Technical tools

మరొకవైపు చిన్నారులు తమకు తెలియ కుండానే తమ వయసుకు మించిన, చూడకూడని అంశాలను చూడటం, తెలుసుకోవడం జరుగుతోంది. వీటిలో వారి ప్రమేయం లేకుండానే సామాజిక మాధ్యమాలు, యూ ట్యూబ్ వీడియోలు, రీల్స్ రూపంలో వారిని ఈ విష ప్రపంచంలోకి లాగేస్తున్నాయి. నెమ్మదిగా ఆవి తమ కంటెట్ డోస్ ని పెంచుతూ వారిని పూర్తిగా వీటికి బానిసలుగా మార్చుతు న్నాయి. స్మార్ట్ఫోన్లో తాము చూసిన విషయాలు బయట చేయాలనే తపన, ఆలోచనలు చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీరు ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకునే సమయంలో వారు తెలియకుండా చెడుమార్గంలో అడుగులు వేగంగా వేసేస్తున్నారు. వీరిని నిరంతరం గమనించి, మార్గ నిర్దేశం చేయాల్సిన తల్లిదండ్రులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నావెనక్కి తీసుకురాలేని నష్టం నేటితరం చిన్నారుల విష యంలో జరిగిపోతోంది. ప్రాథమిక పాఠశాలస్థాయి విద్యార్థు లలో సైతం ఇటీవల ఇటువంటి అడల్ట్ కంటెట్కి సంబంధిం చిన అంశాలను వీక్షించడం, తరచూ వాటిని చూడటం పరి పాటిగా మారిపోతోంది. ఇదివారి మానసిక పరిస్థితిని ప్రభా వితం చేయడం, విద్యలో దృష్టి సారించలేక పోవడం వంటి విపరీత చర్యలకు కారణంగా మారిపోతోంది. చిన్నారులను నిరంతరం గమనిస్తూ వారి సమస్యలను వింటూ, వారికి సూచనలు అందించే పెద్దతరం ఎంతో అవసరం. అటువంటి పెద్ద తరం మన ఇంటిలో లేనప్పుడు తల్లితండ్రులే తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా నడచుకోవాలి. భార్యభర్తలిద్దరూ నిత్యం తమపిల్లలతో కొంత సమయం గడపడం, వారి ఆలోచనలు, ఆకాంక్షలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో వారు చెడు ఆలోచనలు, ధోర ణులదిశగా అడుగులు వేయకుండావారికి సున్నితంగా మార్గ నిర్దేశం చేయాలి అప్పటికే వారు చెడుమార్గంలో అడుగులు వేసినా పెద్ద మనసుతో అర్థంచేసుకుని, వారిని సక్రమ మా ర్గంలో నడిపించాలి. చిన్నారులు సైతం ఒక చిన్న విషయా న్ని గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలిగే పనులను మాత్రమే వారుచేయాలి. తల్లిదండ్రులకు చెప్పుకో లేని పనులు ఎప్పుడూ వారుచేయరాదు. ఏదైనా పని చేయాలనిపిస్తే ముందుగా తల్లిదండ్రులకు ఆ విషయంచెప్పి వారి సలహా, సూచనలు తీసుకోవాలి. అప్పుడు ఎటువంటి నష్టం జరగదు. ఏం జరుగుతుందిలే అనే నిర్లక్ష్య ధోరణితో తల్లిదండ్రులకు చెప్పకుండాపరిపక్వత లేని వయసులో మనసు కు నచ్చినది చేసేద్దామని అడుగేస్తే… భవిష్యత్తును చేజేతులా అంధకారంలో నెట్టేసినట్టే.
-డాక్టర్ వి.వి.ఎస్.వి నరసింహం

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870