📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Jagan : నాడు నన్ను 16 నెలలు జైలులో పెట్టారు: వైఎస్‌ జగన్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: April 26, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YS Jagan : పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా తాను కానీ, పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో తనను అన్యాయంగా 16 నెలల పాటు జైలులో ఉంచారని, పార్టీని నడపలేని పరిస్థితులు కల్పించినా ప్రజలు తనను, పార్టీని ఆదరించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అక్రమాస్తుల కేసులో అన్యాయంగా ఇరికించారు

ఇప్పుడు ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. వాళ్లు ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారు. నన్ను మరోసారి జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు” అని అన్నారు. నాడు నన్ను 16 నెలలు జైలులో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారు. అయినా ప్రజలు ఆశీర్వదించారు. గతంలో అక్రమాస్తుల కేసులో తనను అన్యాయంగా ఇరికించి జైలుకు పంపినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అఖండ విజయాన్ని అందించారని జగన్ గుర్తుచేశారు.

ప్రజల మద్దతు తమకే ఉంటుందని ధీమా

అదే విధంగా, ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు బనాయించినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ ఈ సమావేశం ద్వారా సంకేతాలు పంపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, అది అంతిమంగా తమ పార్టీకే లాభిస్తుందని అభిప్రాయపడ్డారు.

Read Also:  కర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అరుదైన చికిత్స

Google news Google News in Telugu Latest News in Telugu PAC meeting Paper Telugu News TDP Government Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.