📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Hydropower సమృద్ధిగా – ఈ నెలలో గరిష్ట ఉత్పత్తికి అవకాశం – సిఎస్ విజయానంద్

Author Icon By Shravan
Updated: September 1, 2025 • 9:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Hydropower : రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలం కారణంగా లభిస్తున్న జల విద్యుత్ ఉత్పత్తిని గరిష్టంగా వినియో గించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (K. Vijayanand) విద్యుత్ సంస్థలకు ఆదేశించారు. ఆదివారం సీఎస్ క్యాంప్ కార్యాలయం నుండి ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఏపిట్రాన్స్న్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చెకూరి, ఏపి ట్రాన్కో డైరెక్టర్లు ఎ.కె.వి. భాస్కర్, జె.వి. రావు, ఎన్.వి. రమణమూర్తి, ఏపీజెన్కో డైరెక్టర్లు ఎం. సుజయ్ కుమార్, పి. అశోక్ కుమార్ రెడ్డి, సిఈ రాజేంద్ర ప్రసాద్ తదితరులతో సిఎస్ వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ ప్రస్తుతానికి రోజుకు సుమారు 22 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతున్న జలవిద్యుత్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో వినియోగిస్తే రోజువారీగా 26 మిలియన్ యూనిట్లు వరకు చేరుకోవచ్చన్నారు. దీని వలన మార్కెట్ కొనుగోళ్లపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు, నాణ్యమైన విద్యుత్ అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమ, గృహాలకు రాబోయే పండుగల సీజన్ లో అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గిస్తూ జలవి ద్యుత్ ఉత్పత్తిని గరిష్టంగా పెంచాలన్నారు. బ్యాంకింగ్ ద్వారా నిల్వ ఉంచిన విద్యుత్ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరి ష్కారంకోసం విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు.

ఏపీ విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు EPMS యాప్ ప్రారంభం

జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ సరఫరా ను మరింత సమర్ధ వంతంగా పర్యవేక్షించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా అందించేందుకు వ్యవసాయ, సాగునీటి విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచిం చారు. ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ రంగంలో సామ ర్థం పెంచాలని, ట్రాన్స్ ఫార్మర్లు, ఫీడర్లు, సబ్స్టేషన్లు ఎల్లప్పుడూ సజావుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు మరమత్తులు, అవసరమైన పరికరాలను ఏర్పాటుచేసు కోవాలని ఆయన సూచించారు. ఎనర్జీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ (EPMS) యాప్ అనే దేశీయంగా అభివృద్ధి చేయబడిన డిజిటల్ ప్లాట్ఫారమ్ను సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుడుతున్నామన్నారు. తద్వారా తక్కువ ధరలతో విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని తగ్గించవచ్చని, విజయవంతమైతే ఈ యాప్ ను విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ సరఫరా స్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారని వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించండమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

Hydropower సమృద్ధిగా – ఈ నెలలో గరిష్ట ఉత్పత్తికి అవకాశం – సిఎస్ విజయానంద్

ఏపీఎస్ఎల్డీసి డిమాండ్ అంచనా ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో రోజువారీ విద్యుత్ అవసరం 210 నుండి 225 మిలియన్ యూనిట్ల వరకు, పీక్ డిమాండ్ సుమారు 10,200 నుండి 10,500 మెగావాట్ల వరకు ఉండనుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ అవసరాలను తీర్చడానికి ఏపీజెన్కోకు చెందిన జలవిద్యుత్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు రోజుకు 100 మిలియన్ యూనిట్లకు పైగా, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 3540 మిలియన్ యూనిట్ల వరకు, పునరుత్పాదక వనరులు వాతావరణ పరిస్థితులను బట్టి 2530 మిలియన్ యూనిట్ల వరకు ఉత్పత్తి చేస్తాయని ఆయన వివరించారు.

దీనికి అదనంగా, ఆగస్టు నెలలో నిల్వ (బ్యాంకు) చేసిన 326 మిలియన్ యూనిట్ల నిల్వను అవసరాల కోసం వినియోగించు కోవచ్చని, మార్కెట్ నుండి విద్యుత్ కొనుగోళ్లు అవసరమైనంత మేరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఆగష్టు ముగిసే నాటికి జలవిద్యుత్ ఉత్పత్తి 2000 మిలియన్ యూనిట్లు దాటిందన్నారు. ఇది గత దశాబ్ద కాలానికి పైగా ఉత్పత్తి చేసిన అత్యధిక స్థాయి రికార్డుగా నమోదైందని ఏ పీ జెన్కో అధికారులు ఈ సందర్భంగా సిఎస్ కు వెల్లడించారు.

EPMS యాప్ అంటే ఏమిటి?

EPMS (Energy Portfolio Management System) యాప్ భారతదేశంలో అభివృద్ధి చేయబడిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ఇది విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని తగ్గించడానికి, విద్యుత్ సరఫరా పర్యవేక్షణను మరింత సమర్ధవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది.

ఏపీ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎలా తీర్చబడుతోంది?

రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ అవసరం 210-225 మిలియన్ యూనిట్ల వరకు ఉండనుంది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి జలవిద్యుత్, థర్మల్ ప్లాంట్లు, కేంద్ర విద్యుత్ సంస్థలు, పునరుత్పాదక వనరులు కలిసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/vijayawada-vijayawada-utsav-in-the-style-of-mysore/andhra-pradesh/539120/?_thumbnail_id=539123

AP electricity updates AP power sector updates Breaking News in Telugu CS Vijayanand news electricity demand supply hydropower production India Latest News in Telugu Telugu News Paper water energy generation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.