📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Sankranti traffic jam : సంక్రాంతి ప్రయాణం కష్టమా? విజయవాడ హైవేపై ట్రాఫిక్ షాక్!

Author Icon By Sai Kiran
Updated: January 10, 2026 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sankranti traffic jam : సంక్రాంతి పండుగ నేపథ్యంలో Hyderabad నుంచి Vijayawada వైపు వెళ్లే ప్రయాణికులతో హైవేపై తీవ్ర వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులు పెద్ద సంఖ్యలో తమ సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నుంచే ట్రాఫిక్‌ భారీగా పెరిగింది. శనివారం ఉదయానికి రద్దీ మరింత ఎక్కువైంది.

హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా Choutuppal, పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. యాదాద్రి–భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవాలని సూచించగా, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగార్జునసాగర్ హైవే మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు. అయితే ఈ మార్గాల్లో కూడా వాహనాల రద్దీ కనిపిస్తోంది.

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో బస్సు, రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొనగా, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక ప్రాంతాలు సందడిగా మారాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపిస్తోంది.

Read Also: Ankush Bharadwaj: షూటింగ్ కోచ్ పై లైంగిక వేధింపుల కేసు?

ఈ మార్గాల్లో ప్రయాణిస్తే…

హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వారు నార్కట్‌పల్లి వరకు వెళ్లి అక్కడి నుంచి అద్దంకి జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్యలు తక్కువగా ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. విజయవాడ హైవే (Sankranti traffic jam) మీదుగా వెళ్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. కొంత దూరం పెరిగినా హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవే మార్గం ప్రయాణానికి అనుకూలమని తెలిపారు.

ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకుని నార్కట్‌పల్లి దాటితే ట్రాఫిక్ జామ్‌ నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ఓఆర్‌ఆర్‌ ద్వారా వెళ్లేవారు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని నాగార్జునసాగర్ హైవే చేరితే ప్రయాణం సాఫీగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

రెండు రోజులు తప్పని రద్దీ

శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ మొదలైంది. స్కూళ్లకు సెలవులు, శని–ఆదివారాలు ఉద్యోగులకు సెలవులు కావడంతో గ్రామాల వైపు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చని, ఆ తర్వాత పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

alternative routes Hyderabad Vijayawada Breaking News in Telugu Choutuppal traffic update festival travel congestion Google News in Telugu Hyderabad to Andhra travel rush Hyderabad Vijayawada highway traffic Latest News in Telugu Pantangi toll plaza traffic Sankranti traffic jam Sankranti travel advisory Telangana traffic news Telugu News Vijayawada highway jam today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.