📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hyderabad: టీటీడీకి భక్తుడి భారీ నగదు విరాళం

Author Icon By Saritha
Updated: February 21, 2026 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు తమ భక్తిని రకరకాలుగా చాటుకుంటారు. ఇటీవల కాలంలో టీటీడీ (TTD) ట్రస్టులకు భక్తుల నుంచి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. కొందరు వాహనాలు, విలువైన వస్తువుల్ని బంగారం, వెండి కానుకలు సమర్పిస్తే, మరికొందరు టీటీడీ నిర్వహించే వివిధ సేవా సంస్థలకు భారీగా విరాళాలు అందజేస్తుంటారు. తాజాగా టీటీడీకి మరో భారీ విరాళం అందింది. తాజాగా, హైదరాబాద్‌కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు స్వామివారిపై ఉన్న భక్తితో రూ. 50 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు.

Read Also: TTD International Women’s Day: టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Hyderabad: Devotee makes huge cash donation to TTD

దాతను అభినందించిన ఈవో

శివకోటి సిద్ధార్థ తాను అందజేసిన రూ. 50 లక్షల విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు కేటాయించారు. శుక్రవారం తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ట్రస్టుకు ఇంత భారీ విరాళం అందించిన దాతను ఈవో అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.