Latest News: Hyderabad Crime News: భర్త వేధింపులు తాళలేక.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

Read Time:  1 min
Hyderabad Crime News
Hyderabad Crime News
FONT SIZE
GET APP

హైదరాబాద్ (Hyderabad) చింతల్‌లో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకోవడం సోషల్ మీడియా, వార్తల వేదికల్లో పెద్ద దుఃఖాన్ని కలిగించింది. ఒక తల్లి, ఇద్దరు కవల పిల్లలను చంపి ఆ తర్వాత తన ప్రాణాలను తీసుకున్న సంఘటన వివాదాస్పదంగా మారింది.

Read Also: AP Crime: రైలులో దారుణం – మహిళపై దాడి, ఆభరణాలు లూటీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సాయిలక్ష్మి (27) (Sailakshmi) రెండేళ్ల వయసున్న తన పిల్లల మాటలు సరిగ్గా రావడం లేదని చిన్న కారణం పేరుతో భర్త నుండి మానసికంగా వేధింపులు ఎదుర్కొంది.తన జీవితం ముగించుకుంది.

ఏలూరు (Eluru) జిల్లా నూజివీడు (Nuzvidu) కు చెందిన చల్లారి అనిల్ కుమార్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు పద్మారావునగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు (Software engineers) గా పనిచేస్తున్నారు.

సాయిలక్ష్మిని బాధ్యురాలిగా చేస్తూ తరచూ గొడవ

వీరికి రెండేళ్ల వయసున్న కవలలు చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి సంతానం.కవలల్లో కుమార్తె లాస్యతవల్లి స్పష్టంగా మాట్లాడుతుండగా.. కుమారుడు చేతన్ కార్తికేయకు మాత్రం మాటలు సరిగా రావడం లేదు. జన్యుపరమైన సమస్యగా వైద్యులు గుర్తించిన ఈ విషయాన్ని భర్త అనిల్‌కుమార్ పదేపదే ప్రస్తావించేవాడు.

కొడుకు మాట్లాడలేకపోవడానికి సాయిలక్ష్మిని బాధ్యురాలిగా చేస్తూ తరచూ గొడవ పడేవాడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా భర్త వేధింపులు (Husband harassment) ఏమాత్రం తగ్గకపోవడంతో.. సాయిలక్ష్మి తీవ్ర మానసిక క్షోభకు గురైంది.

Hyderabad Crime News
Hyderabad Crime News

పలుమార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం

ఆమె తల్లిదండ్రులు పలుమార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.భర్త అనిల్‌కుమార్ మంగళవారం విశాఖపట్నం వెళ్లాల్సి ఉండగా.. సోమవారం విధులు ముగించుకుని మియాపూర్‌ (Miyapur) లోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు.

ఆ రాత్రి భర్త వీడియో కాల్‌లో మాట్లాడిన తర్వాత సాయిలక్ష్మి కఠిన నిర్ణయం తీసుకుంది. తన ఆవేదనను, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఆమె తల్లిదండ్రులను ఉద్దేశించి తన ఫోన్‌లో ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేసింది.

నాతో వచ్చిన వారు నాతోనే పోతారు

‘తన భర్త మారడు. అందుకే కష్టమైనా ఈ పొరపాటు చేస్తున్నా.. క్షమించండి. నేను లేనప్పుడు పిల్లలు ఉండడం అనవసరం. నాతో వచ్చిన వారు నాతోనే పోతారు’ అని ఆమె ఆ వీడియోలో రికార్డ్ చేసింది.మంగళవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న కవలలు కార్తికేయ, లాస్యతవల్లి ముఖాలపై దిండును అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చింది.

ఆ తర్వాత తాను నివసిస్తున్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయిలక్ష్మి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని వీడియోను పరిశీలించారు. సాయిలక్ష్మి తండ్రి మారయ్యబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అనిల్‌కుమార్, అతని అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.