హైదరాబాద్ (HYD Crime) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్లపల్లి– ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది. మృతులను బోడుప్పల్‌కు చెందిన విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు, విశాల్, చేతనరెడ్డిగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
Read Also: ACB Raids: హోంగార్డు అవినీతి గుట్టు రట్టు
కేసు నమోదు
ఈమేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఆత్మహత్యలకు కారణమై ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: