Latest News: Visakhapatnam: విశాఖలో భారీ పెట్టుబడి

Read Time:  1 min
Visakhapatnam
Visakhapatnam
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి భారీ పెట్టుబడికి కేంద్రబిందువుగా మారింది. విశాఖపట్నం (Visakhapatnam) లో ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం కె. రహేజా కార్పొరేషన్ (K. Raheja Corporation) భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం కలిగి ఉంది. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీర ప్రాంతం — విశాఖ(Visakhapatnam) లో ప్రదర్శించనుంది.

Read Also: Law : చట్టం అందరికి సమానమేనా?

Visakhapatnam
Visakhapatnam

కె. రహేజా సంస్థ ఐటీ కంపెనీలకు అవసరమైన వాణిజ్య (commercial) మరియు నివాస (residential) భవనాలను నిర్మించేందుకు రూ.2,172.26 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. దీనికోసం ప్రభుత్వం విశాఖ మధురవాడ ఐటీ (IT) హిల్ నంబర్-3లో 27.10 ఎకరాల భూమి కేటాయించాలని కోరింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు అయితే, దాదాపు 9,681 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.