📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Hotel Bar Licenses : హోటల్ బార్ల నిర్వాహకులకు గుడ్ న్యూస్ : లైసెన్సు ఫీజు తగ్గింపు

Author Icon By Divya Vani M
Updated: April 27, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో స్టార్ హోటళ్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.బార్ లైసెన్సుల ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకు త్రీస్టార్, పై స్థాయి హోటళ్ల బార్లకు రూ.66.55 లక్షల ఫీజు ఉండేది.ఇందులో రూ.5 లక్షలు లైసెన్సు ఫీజు కాగా, రూ.50 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జీగా వసూలు చేసేవారు.అంతేకాకుండా, ప్రతి ఏడాది ఫీజు 10% పెరుగుతుంది.నూతన నిర్ణయంతో ఇక నుంచి లైసెన్సు ఫీజు రూ.5 లక్షలకే పరిమితం అవుతుంది.అలాగే నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.20 లక్షలుగా నిర్ణయించారు.ఏటా పెరిగే 10 శాతం ఫీజు పెంపు రద్దు చేశారు.

రాష్ట్రంలో వ్యాపార వాతావరణం మెరుగుపడే సూచనలు

ఈ నిర్ణయం వల్ల హోటల్ యాజమాన్యాలపై ఆర్థిక భారం తగ్గనుంది.ముఖ్యంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఇది కీలకంగా మారనుంది.హాస్పిటాలిటీ రంగానికి ఇదొక ఊపిరి పీల్చే అవకాశం.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఫీజులు ఎక్కువగా ఉండేవి.దీనిపై ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది ఆ ప్రతిపాదనలతో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి

తగ్గిన ఫీజులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.తాజా ఉత్తర్వులు విడుదలయ్యాయి.పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంలో ఇది కీలకంగా మారనుంది.బార్ల లైసెన్సింగ్ వ్యవస్థను మరింత సరళతరం చేయడం ద్వారా పెట్టుబడులు పెరిగే అవకాశముంది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది తోడ్పాటిచేస్తుంది.

Read Also : Food Shortage : పాక్ ఆర్థిక వృద్ధిరేటు 2.7 శాతానికి తగ్గింపు

Andhra Pradesh Bar License Fee Cut AP Government Tourism Promotion AP Star Hotel License Update APTDC Bar License Proposal Excise Department AP Orders Hospitality Sector Reforms AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.