అరకు (Araku) లోయ అంటే అందమైన ప్రకృతి దృశ్యాలు, ఎత్తైన కొండలు, లోయలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ అందాలను పైనుంచి ఆస్వాదించే అదృష్టం పర్యాటకులకు దక్కబోతోంది. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ (Hot air balloon ride) అధికారికంగా ఈనెల 12 నుంచి ప్రారంభమవుతోంది.పర్యాటకులు ఇకపై అరకులోయను ఆకాశం నుంచే వీక్షించే అవకాశం పొందనున్నారు. 300 మీటర్ల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా లోయలు, పచ్చని కొండలు, అరణ్యాలను చూసే అనుభవం లభిస్తుంది. ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించి చిరస్మరణీయ క్షణాలుగా మార్చుకోవచ్చు.
ట్రైల్ విజయవంతం
ఇప్పటికే హాట్ ఎయిర్ బెలూన్ ట్రైల్ విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులు పర్యాటకులకు అందుబాటులో ఉంచగా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో రెగ్యులర్‌గా అందుబాటులోకి రానుంది.పివో ఛాంబర్‌లో హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్‌ను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ ఆవిష్కరించారు. ఈనెల 12వ తేదీ నుంచి పద్మాపురం గార్డెన్లో పర్యాటకులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.
పర్యాటకులకు గుడ్ న్యూస్
అరకులోయను “ఆంధ్ర ఊటీ” అని పిలుస్తారు. ప్రతీ ఏడాది వేలాది మంది దేశం నలుమూలల నుంచి సందర్శిస్తారు. ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ ప్రారంభం కావడంతో పర్యాటక ఆకర్షణ మరింత పెరగనుంది. ఇది పర్యాటక రంగానికి కొత్త ఊపు తెస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.ప్రకృతిని పైనుంచి చూసే అనుభవం అరుదు. హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా పర్యాటకులు ఆకాశంలో తేలిపోతూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించగలరు. ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం పర్యాటకుల కలను నిజం చేస్తోంది.
సమగ్ర ప్రణాళికలు
ప్రారంభ దశలోనే భద్రతా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనుభవజ్ఞులైన సిబ్బంది పర్యాటకులను తోడ్కొని ప్రయాణం సురక్షితంగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ టూరిజం ప్రమోషన్‌లో కీలక పాత్ర పోషించనుంది.మొత్తానికి, అరకులోయలో హాట్ ఎయిర్ బెలూన్ ప్రారంభం పర్యాటకులకు గోల్డెన్ ఛాన్స్‌గా మారింది. ప్రకృతి అందాలను ఆకాశం నుంచే వీక్షించాలనుకునే వారికి ఇది మరపురాని అనుభవం కానుంది.
Read Also :