ఒకప్పుడు రాజరికపు గుర్తుగా, సామర్థ్యానికి సంకేతంగా నిలిచిన గుర్రపు స్వారీ,ఇప్పుడు విశాఖ పట్టణ యువతలో మళ్లీ ఆదరణ పొందుతోంది. చరిత్రలోనూ, పురాణాలలోనూ గుర్రాలకు విశేష స్థానం ఉంది. రాజులు చేసే దినచర్యలో, యుద్ధాల్లో, వేటలలో గుర్రాల పాత్ర కీలకమైనది. నిజంగా రాజరికపు కుటుంబంలో గుర్రపు స్వారీ రాని వారంటూ ఉండరని పెద్దలు చెబుతారు. అలాంటి గొప్ప సంప్రదాయాన్ని నేటి యువత తిరిగి నేర్చుకోవడం గర్వకారణంగా భావించాలి.గుర్రపు స్వారీలు ఒక ఉల్లాసం గుర్రాలపై స్వారీ చేయడం భలే సరదాగా ఉంటుందని రైడర్స్ అంటున్నారు. ఇందుకోసం నిష్ణాతుల సమక్షంలో రైడర్స్ (Riders) శిక్షణ తీసుకొంటున్నారు. పరుగు పందాల మాదిరిగానే, గుర్రాల స్వారీ పోటీలు జరుగుతున్నాయి. విజయవాడలో గుర్రపు స్వారీలకు స్కూల్ కరస్పాండెంట్ కోర్స్‌తో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకు గుర్రంపై శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణ నిపుణులు
గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ గుర్రపు స్వారీలకు శిక్షణ కొనసాగుతుంది. రోజుకి అరగంట, ఇరవై రోజులు మాత్రమే శిక్షణ ఉంది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీరధారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. అందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా మానసిక ఉల్లాసానికి, శరీరధారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనీ శిక్షణ నిపుణులు (Experts) అంటున్నారు.ప్రపంచంలో గొప్ప వ్యాయామం గుర్రపు స్వారీ మాత్రమే అని గుర్రపు స్వారీ శిక్షణ నిపుణులు చెపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారిగా గుర్రపు రైడ్ శిక్షణ ఇక్కడ ఇస్తున్నామని.

ఒక చోట ఉంచే ప్రదేశాన్ని టేబుల్స్
చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా గుర్రపు స్వారీ నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొంటే, మనసు పెట్టి 20 రోజులలో గుర్రపు స్వారీ నేర్చుకోవచ్చంటున్నారు. గుర్రాలను ఒక చోట ఉంచే ప్రదేశాన్ని టేబుల్స్ అంటారు. గుర్రాలకు ఆలనా పాలన ఇందులోనే జరుగుతుందిని తెలిపారు.ప్రస్తుతం అనేకమంది క్రీడాకారులు వివిధ కళల వైపు మొగ్గు చూపుతున్నారు. ఐతే గుర్రపు స్వారీ (Horse Riding) కూడా ఓకళ. అంతరించిపోతున్న ఈ కళను అందరికి ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ ప్రాంతంలో గుర్రపు స్వారీ శిక్షణ ప్రాంభించడం జరిగిందని శిక్షణ నిపుణులు అంటున్నారు.ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజులు ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికి గుర్రంపై వెళ్తే, తిరిగి అదే మార్గంలో గుర్రం తనంతట తానే నడుచుకుంటూ వస్తుందట. అంటే గుర్రానికి దారి గుర్తు పెట్టుకునే అద్భుతమైన శక్తి ఉండేది. ఇది కేవలం పురాణ గాథ కాదు, అనేక గుర్రాలపై పనిచేసిన నిపుణుల ఇదే చెబుతారు.
Read Also: YS Sharmila: చంద్రబాబు జగన్ లకు మోదీని ప్రశ్నించే దైర్యం లేదన్నషర్మిల