📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vangalapudi Anitha: కుప్పంలో అమానుష ఘటనపై హోంమంత్రి స్పందన

Author Icon By Shobha Rani
Updated: June 17, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే ఆమె బాధితురాలితో నేరుగా మాట్లాడి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియాలో స్పందన
ఈ సంఘటనకు సంబంధించి హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నారాయణపురంలో జరిగిన దారుణం గురించి తెలుసుకున్న వెంటనే, ఆమె బాధితురాలితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలి ద్వారా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. జరిగిన అన్యాయానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, బాధితురాలికి భరోసా ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బాధితురాలితో తాను మాట్లాడిన వీడియోను కూడా మంత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Vangalapudi Anitha: కుప్పంలో అమానుష ఘటనపై హోంమంత్రి స్పందన

పోలీసులు, అధికారులకు హోంమంత్రిని ఆదేశాలు
ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే తనకు సమర్పించాలని ఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని, ఈ అమానుషానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు.
మహిళల భద్రతపై ప్రభుత్వ దృష్టి
“మహిళల ఆత్మగౌరవానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని హోంమంత్రి అనిత ప్రకటనలో స్పష్టంగా చెప్పారు.
“రాష్ట్రంలో మహిళల భద్రత, ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యత. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.” అని అన్నారు. ఈ ఘటనను మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ధారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, గ్రామ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ, ఫిర్యాదు వ్యవస్థ బలోపేతం, మహిళల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

Read Also: Vijayawada: ఏపీలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు

#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Home Minister's response Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to the inhumane incident in Kuppam Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.