📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Home Minister Anitha: హోంమంత్రి అనితకు అస్వస్థత

Author Icon By Anusha
Updated: March 5, 2026 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆమెకు స్వల్పంగా నలతగా అనిపించడంతో సిబ్బంది వెంటనే స్పందించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనితకు రక్తపోటు (BP) పెరగడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వైద్యులు ధృవీకరించారు.

Read Also: APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ఫ్రీ బస్సు

సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్న అనిత.. ఉన్నట్టుండి నీరసం

ఈ రోజు ఉదయం నుంచి అనిత శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై జరిగిన చర్చలో కూడా ఆమె భాగమయ్యారు. మండలి సమావేశాలు వాయిదా పడిన తర్వాత, అసెంబ్లీ కొనసాగుతున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు.. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.గత వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాలు, వరుస కార్యక్రమాలతో హోంమంత్రి తీరిక లేకుండా గడుపుతున్నారు.

Home Minister Anitha is unwell

నిరంతర పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం వల్లే ఆమె నీరసించిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.హోంమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. అంతా సవ్యంగా ఉంటే ఈ రోజు సాయంత్రానికే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Assembly Sessions 2026 AP Home Minister Anitha Vangalapudi Anitha Health Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.