అమరావతిలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో, ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి అనిత (Home Minister Anita) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖకు అవసరమైన సాంకేతికత, వసతుల కల్పన విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని ఆమె తేల్చిచెప్పారు.
Read Also: AP: తలసరి పాల వినియోగంలో ఏపీ టాప్
త్వరలో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు
ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల ప్రస్తుత పరిస్థితి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీ వినియోగం, పోలీసు విభాగానికి చెందిన మానవ వనరులు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన
అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు త్వరలోనే కొత్త వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని, శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె పునరుద్ఘాటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: