తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ మరణాలు మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 2020 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 44,140 మంది హెచ్ఐవీ (HIV) బాధితులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 32,642 మంది మరణించగా, తెలంగాణలో 11,498 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇదే కాలంలో మొత్తం 1.81 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు మరణించారని కేంద్రం తెలిపింది.హెచ్ఐవీ నివారణపై ఇంకా బలమైన చర్యలు అవసరమని స్పష్టంగా సూచిస్తున్నాయి.
Read also: Pregnancy Care: ప్రెగ్నెన్సీలో నిద్ర సమస్యకు చిట్కాలు
HIV deaths are increasing in the Telugu states
ఆధునిక జీవనశైలి ప్రభావం వల్ల హెచ్ఐవీ ప్రమాదం పెరుగుతోందని
ఇదిలా ఉండగా, హెచ్ఐవీ వ్యాప్తి కొత్త రంగాల్లో కూడా పెరుగుతోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆధునిక జీవనశైలి ప్రభావం వల్ల హెచ్ఐవీ ప్రమాదం పెరుగుతోందని న్యాకో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల కోసం హెచ్ఐవీ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలకు సూచించింది. అయితే తెలంగాణలో మాత్రం హెచ్ఐవీ సంక్రమణ రేటు క్రమంగా తగ్గుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2024లో 0.44గా ఉన్న సంక్రమణ రేటు 2025 నాటికి 0.41కు తగ్గినట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వెల్లడించింది. సరైన అవగాహన, సమయానుకూల పరీక్షలతో హెచ్ఐవీని నియంత్రించవచ్చని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: