📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Himanshu Shukla: GST వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

Author Icon By Siva Prasad
Updated: February 5, 2026 • 10:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Himanshu Shukla:రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న GST వసూళ్లను పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్‌లో కమర్షియల్ టాక్స్ శాఖతో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. తొలుత జాయింట్ కమిషనర్ (స్టేట్ టాక్స్) వై. కిరణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పన్ను వసూళ్ల పురోగతిని వివరించారు.

Read Also: AP: జగన్‌ తప్పులు చేసి మాపై ఆరోపణలు చేస్తున్నారు: చంద్రబాబు

నమోదు కాని వ్యాపార సంస్థలపై నిఘా

ఈ సందర్భంగా కలెక్టర్(Himanshu Shukla) మాట్లాడుతూ జిల్లాలో నమోదు కాని వ్యాపార సంస్థలను గుర్తించి GST పరిధిలోకి తీసుకురావాలని, పన్ను ఎగవేతను అరికట్టేందుకు శాఖల మధ్య సమాచారాన్ని క్రమం తప్పకుండా పంచుకోవాలని సూచించారు. పన్ను బకాయిల వసూళ్లకు సంబంధించి బకాయిదారుల ఆస్తుల వివరాలను కమర్షియల్ టాక్స్ శాఖకు అందించాలని, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

GST మరియు TDS నిబంధనల అమలు

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల సమయంలో GST మరియు TDS నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని, రూ.2.5 లక్షలకు పైబడిన సరఫరా ఒప్పందాలపై GSTR-7 ద్వారా TDS చెల్లింపులు చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు డీజిల్‌ను స్థానికంగా కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రానికి పన్ను ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.గ్రానైట్ తదితర సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రవాణా మరియు మైనింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పన్ను ఎగవేతదారులపై FIR నమోదు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.

వృత్తి పన్ను (Profession Tax) చెల్లింపులు

అంతేకాకుండా రూ.10 లక్షల వార్షిక టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు, డాక్టర్లు, ఆర్కిటెక్ట్స్ వంటి నిపుణులు ప్రొఫెషన్ టాక్స్ చట్టం కింద పన్ను చెల్లించాలని కలెక్టర్ వివరించారు.ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ (స్టేట్ టాక్స్) వై. కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఎం. సత్య ప్రకాష్, ఏఎస్ పి దీక్ష, మున్సిపల్ కమిషనర్ నందన్, జడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా రిజిస్టార్ బాలాంజనేయులు, పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్, డిటిసి చందర్, డిపిఓ వసుమతి, డిఇఓ బాలాజీ రావు, కమర్షియల్ టాక్స్ అధికారులు గోపీచంద్, సోమ సుందర ప్రసాద్, గౌస్ పీర, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP News Commercial Tax Department District Collector Orders District Collector Review Government Revenue GST Collections GST Registration GSTR-7 TDS Himanshu Shukla IAS Latest ap news Profession Tax Andhra Pradesh State Revenue Growth. Tax Arrears Tax Evasion TDS on Contracts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.