📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Highways : రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో విస్తరణ, గిరిజనుల ఇబ్బందుల తొలగింపు

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 10:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Highways : రవాణా వ్యవస్థ లేక ఉహించనంతగా అభివృద్ధి సాధించని ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు నిర్మించి గిరిజనుల ఇక్కట్లు తీరుస్తామని సిఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) పునరుద్ఘాటించారు. గిరిజన సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ది అభివృద్ధిని కార్యచరణలో పెట్టిందన్నారు. గిరిజన నివాశిత మారుమూల ప్రాంతాలకు ఇకపై రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్రాంతాల్లో నేషనల్ హైవే సంస్థ ఆధ్వర్యంలో ఏడాదిలో రూ.200 కోట్లతో 203 గిరిజన గ్రామాలకు 269 కి.మీ. మేర బిటి రోడ్లు వేశామన్నారు. ఆదివాసీ ప్రాంత అభ్యుదయానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సిఎంఒ ఓ సమాచార పత్రం విడుదల చేసింది. గిరిజన జిల్లాల మీదుగా 515 కి.మీ. పొడవున రూ.8,570 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని సిఎం వివరించారు. వీటిలో పాడేరు గొండిగూడ, కొయ్యూరు చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం – కొయ్యూరు విబీ-516ని విస్తరణ పనులు, రాయపూర్ – విశాఖపట్నం సెక్షన్ విబీ-130దిదీ, భద్రాచలం-కుంవిబీట-30 సెక్షన్, లంబసింగి-పాడేరు, చింతూరు-మోటు సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లై ఓవర్లు ఉన్నాయి అని సిఎం తెలిపారు.
ఆదివాసీల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది.
గిరిజన గ్రామాల్లో వైద్యానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 1,487 మంది సికిల్ సెల్ రోగులకు నెలకు రూ.10,000 పింఛన్ ఇస్తున్నాం. గర్భిణీలకు పోషకాహార ప్యాకేజీలు, రవాణా సదుపాయం అందిస్తున్నాం. డోలీ మోతలు లేకుండా 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం. 35 కొత్త భవనాలు నిర్మాణంలో ఉండగా 15 మరమ్మతులు చేస్తున్నాం. 122 ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటుచేశాం. రూ.482 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం అని సిఎం చంద్రబాబు తెలిపారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తం కావాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశ మన్నారు.. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. ప్యారిస్లో కూడా అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేశాం. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు అవుతోంది. దీనిపై 2.46 లక్షల మంది. ఆధారపడి జీవిస్తున్నారు. మరో లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం. 1.80 లక్షల ఎకరాల్లో చెర్రీ సాగు చేసి 90,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు. మన గిరిజన రైతన్నలు మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలమే కాదు కుంకుమవంటి పంటలు సాగుచేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఏజెన్సీ అంటే గంజాయి ప్రాంతమని చెడుగా భావించేవారు.

గత ప్రభుత్వం స్వచ్చమైన ఏజెన్సీలను కలుషితం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఏజెన్సీ లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా గంజాయి మాట వినపడటంలేదు అని సిఎం చంద్రబాబు తెలిపారు. పోటీ పరీక్షలకు ఎస్టీ విద్యార్ధులను సిద్ధం చేయడానికి రూ.4.5 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తున్నాం. రూ.150 కోట్లతో రెసిడెన్షి యల్ పాఠశాల భవనాలు వసతి గృహాలుగా మార్చుతున్నాం. రూ.64 కోట్ల వ్యయంతో ఐటిడి పాడేరులో 418 పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టాం. పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం. ఐటిడిఎ రంపచోడవరంలోని వైరామవరం మండలాన్ని పరిపా లనా సౌలభ్యం కోసం 2 మండలాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నాం. వీటితో పాటు రూ.50 కోట్లతో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్పురం, శ్రీశైలం ఐటిఇఎ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. త్వరలోనే వీటిని పూర్తి చేసి గిరిజనులకు అందుబాటులోకి తెస్తాం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


ఆర్థిక సమస్యలు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. మా గిరిజన ఆడబిడ్డలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఏజెన్సీలో 7 క్యాంటీన్ల ద్వారా భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెలాఖరున మెగా డిఎస్సీ ద్వారా టీచర్ల నియమాకం భర్తీచేస్తాం. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఈ పెట్టుబడుల ద్వారా 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 5 వేల మంది గిరిజన మహిళలకు ఏడాదికి రూ. లక్ష ఆదాయం వచ్చేలా చేస్తాం అని ముఖ్యమంత్రి అన్నారు. 1483 గిరిజన హ్యాబిటేషన్లకు రూ.2,850 కోట్ల వ్యయంతో గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి ఊరికి రోడ్డు వేస్తాం. రూ.1938 కోట్ల వ్యయంతో ఐటిడిఎలో గిరిజనుల ఆదాయం పెంచే మార్గాలు చూపిస్తాం. రూ.8575 కోట్లో వ్యయంతో 515 కిలోమీటర్ల రహదారులు పూర్తి చేస్తాం. రూ.19,411 కోట్లతో 472 కిలోమీటర్లు అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు వేస్తాం. ఎకో టూరిజం కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తాం. విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ పనులు జరుగుతున్నాయి అన్నారు. అరకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలను టూరిజం క్లస్టర్లుగా తయారుచేస్తాం. రాబోయే రోజుల్లో స్థానికంగా 1000 వరకూ హోమ్ స్టేలు ఏర్పాటు చేసుకునేలా ఆర్థిక సాయం చేస్తాం. పాడేరులో మోదకొండమ్మ ఆలయం అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాం. స్థానికంగా మహిళా శిశు సంక్షేమం కింద 96 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. విశాఖ జిల్లాలో గిరిజనులందరికీ గ్రామీణ ఆవాజ్ యోజన కింద 54 వేల ఇళ్లు మంజూరు చేస్తాం అన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/ex-minister-roja-former-minister-roja-in-trouble/andhra-pradesh/528680/

8570 Crore Highway Works Andhra Pradesh Road Development Breaking News in Telugu Google news Latest News in Telugu National Highways Expansion Tribal Welfare Roads

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.