📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Highway : సిద్ధమవుతున్న గ్రీన్ఫీల్డ్ హైవే విజయవాడ నుంచి హైదరాబాద్ మూడు గంటలే

Author Icon By Shravan
Updated: August 20, 2025 • 9:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Highway : రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే అత్యంత కీలకమైన విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి (Vijayawada-Hyderabad National Highway) ఆధునీకంగా తీర్చిదిద్దుతున్నారు. అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మిస్తున్నారు. ఆంధ్రా-తెలంగాణ అనుసంధానంలో సరికొత్త గేమ్ఛంజర్ అవుతుందంటున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల రాజధానుల నడుమ రెండు నుంచి మూడు గంటల్లోనే వెళ్లే అవకాశం ఉంది. ప్రతిపాదనలే కాదు ప్రభుత్వాల ప్రముఖులు కూడా తరచూ ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖంగా ఉండటంతో కేంద్రం కూడా ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపింది, అందులో భాగంగానే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రోడ్లు, ఉపరితల రవాణా సత్వర చర్యలు ప్రారంభించాలని కేంద్రం ఆదేశించింది.

అమరావతి–హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్ట్

ఇరు రాష్ట్రాలు అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాయి. తెలంగాణ సర్కారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఫోర్త్సిటీకి ఈ ప్రాజెక్టులు అనుసంధానం చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ శివారులో డ్రైపోర్టు నిర్మించి అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గానికి ప్రణాళికలు చేస్తోంది. ఇదే విషయం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎపి
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎపి సిఎస్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్లతో చర్చలూ జరిపారు. ఇక ఈ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం జరిగితే ఇరు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలకు లబ్ధి చేకూరనుందని రవాణారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవడానికి 5 గంటలకు పైగా సమయం పడుతుంది. అలాగే, ఇరు రాష్ట్రాలకు ఎగుమ తులు, దిగుమతులు సులభం అవుతాయి. కారిడార్ సమీపంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. రహదారి వెంబడి వాణిజ్య, వ్యాపారాలు పెరిగి ఆర్థికవృద్ధి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇరు రాష్ట్రాలకు గేమ్‌చేంజర్

ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాలకు ఊహించిన దానికంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధితో పాటు ప్రాంతీయ సమైక్యత బలపడి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతం కావాడా నికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఇదు రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే అంశాలపై తెలంగాణ, ఎపి ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటోంది. అందులో భాగంగానే అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫోల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే (Greenfold Express Highway) నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య 65వ నంబరు నేషనల్ హైవే ఉంది. ప్రస్తుతం ఉన్న రోడ్ల అభివృద్ధి, వరసల పెంపుతో ఆ ఫలితాలు ఇప్పటికే చూస్తున్నాం. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు మరో మెగా ప్రాజెక్టు రానుంది.

అదే అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే. కేంద్ర ప్రభుత్వం కూడా దీని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి, ఈ ఎక్సెప్రెస్వే ప్రాజెక్ట్కు అయ్యే ఖర్చెం? ఇది అందుబాటులోకి వస్తే ఇరురాష్ట్రాలకు కలిగే లాభాలేంటి? అనే అంశాలు తెలుసుకుందాం. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ నుంచి కాకుండా ఫోర్త్ సిటీ నుంచి ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం, ఏపీ సర్కారు తెలిపినట్లు సమాచారం. అమరావతిఫోర్సిటీని కలుపుతూ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే వస్తే విజయవాడహైదరాబాద్ ప్రస్తుత జాతీయ రహదారికి అది సమాంతర రోడ్డు అవుతుంది. ఇప్పుడున్న జాతీయ రహదారికి అటూఇటుగా 10 కి.మీ. దూరంలో దీన్ని నిర్మిస్తే ప్రత్యేక బెస్ట్ తయారు అవుతుంది.

దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల చర్చల్లో ఎక్స్ప్రెస్ హైవే ఎలైన్మెంట్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలైన్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏవైనా మార్పులుంటే వాటినీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల సిఎంలు ఈ రహదారిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ వరకు ఉన్న పాతరహదారితో పోల్చితే కొత్తగా రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేతో సుమారు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. పోర్టుల ద్వారానే విదేశాలకు సరకు రవాణా జరుగుతుంది.

ఐతే, తెలంగాణకు సముద్రతీరం లేకపోవడంతో పోర్టులు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. దీంతో సముద్రమార్గంద్వారా ఎగుమతులు, దిగుమతులు చేయడానికి ఏపీపై ఎక్కువ ఆధారపడుతోంది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే ఎగుమతులు, దిగుమతులకు వ్యయప్రయాసలు తగ్గనున్నాయి. ఇందుకోసం తెలంగాణప్రభుత్వం రాజధాని నగర శివారులో డ్రైపోర్టు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్సైప్రెస్ హైవేను మచిలీపట్నం పోర్టు వరకు పొడగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/free-bus-huge-response-to-free-bus/andhra-pradesh/532954/

Breaking News in Telugu Expressway Andhra Pradesh Telangana Greenfield highway Vijayawada Hyderabad Hyderabad Vijayawada 3 hours road Latest News in Telugu New highway project Hyderabad Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.