📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Highway – రూ.2,600 కోట్లతో విజయవాడ – బందరు మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మాణం – మంత్రి కొల్లు రవీంద్ర

Author Icon By Shravan
Updated: August 30, 2025 • 8:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Highway : ఆడబిడ్డలను ఆర్థికంగా బరోపేతం చేయడమే కూ టమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) పేర్కొన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైనందుకు శుక్రవారం ఉదయం నగరంలోని టీటీడీ కల్యాణ మం డపంలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత వ్యవహారిక భాష ఉద్యమ పితామహులు గిడుగు వెంకట రామమూర్తి పంతులుజయంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర మంత్రి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిడుగు తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలను వారు కొనియాడారు. మంత్రి తన ప్రసంగాన్ని కొన సాగిస్తూ ఆడబిడ్డల్లో చైతన్యం తెచ్చి, మహిళలకు పద్మావతి విశ్వవిద్యాలయం నెలకొల్పి, రిజర్వే షన్లు, ఆస్తి హక్కును కల్పించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామా రావుకే దక్కుతుందన్నారు.

ఆడబిడ్డలను మరింత ముందుకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే దక్కుతుం దన్నారు. డ్వాక్రా సంఘాలను పెట్టడం, సాఫ్ట్వేర్ రంగంలో మహిళలకు ప్రోత్సహించి విదేశాలకు పంపడం, ఆడబిడ్డలు ఇబ్బంది పడకుండా దీపంపథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ల సరఫరా, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు., తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 68 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద రాష్ట్రంలో ఉన్న బస్సులలో 74 బస్సులను కేటాయించారని, చిన్న చిన్న పనులు చేసుకునే మహిళలు రూ.1500 నుంచి రూ.2000 నెలవారీ ఖర్చులు ఆదా కావాలని, ఆ డబ్బులు వేరే విధంగా ఉపయోగించుకోవాలన్నారు.

మచిలీపట్నం-విజయవాడ ఆరు లైన్ జాతీయ రహదారికి రూ.2600 కోట్ల మంజూరు

గతంలో మచిలీపట్నం-విజయవాడకు నాలుగు వరుసల జాతీయ రహదారిని నిర్మించేందుకు కృషి చేశామన్నారు. అలాగే నేడు మచిలీపట్నం-విజయవాడకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో మాట్లాడామన్నారు. రూ. 2600 కోట్ల వ్యయంతో ఆ రహదారి మంజూరు చేయడం జరిగిందన్నారు. మచిలీపట్నం నుండి రేపల్లె వరకు 45 కిలోమీటర్ల రైల్వే లైన్ (Railway line) పొడిగింపు కార్యరూపం దాల్చిందని, ఇందుకోసం 3 నెలల క్రితం కేంద్ర మంత్రితో మాట్లాడామని అన్ని ప్రయత్నాలు చేశామని 2 సంవత్సరాలలో పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందన్నారు.

Highway – రూ.2,600 కోట్లతో విజయవాడ
ఉచిత బస్సు పథకానికి 8,500 బస్సుల కేటాయింపు: ఆర్టీసీ చైర్మన్

ఈ రైల్వే లైన్ కోసం పోరాటం చేసిన బందరు నివాసి కొక్కిలిగడ్డ కోదండరామయ్య నేడు చనిపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. రాష్ట్రంలో 10,500 బస్సులు ఉండగా అందులో 75 8,500 బస్సులను మహిళల కోసం ఉచిత బస్సు పథకానికి కేటాయించామన్నారు. అనంతరం మహిళా లబ్ధిదారులకు మంత్రివర్యులు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, ఆర్టిసి ఆర్ఎం వెంకటేశ్వర్లు, డిఎం పెద్దిరాజు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, కార్పొరేటర్లు అనిత, సమతాకీర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు గొర్రెపాటి గోపీచంద్, రొండి కృష్ణ, మున్సి పల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథ్, పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/vice-president-vice-presidential-elections/national/537868/

6-lane road project Andhra Pradesh highways AP infrastructure development Breaking News in Telugu kollu ravindra Latest News in Telugu road construction project Telugu News Paper Vijayawada Bandar Highway

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.