Bhumana Karunakar : తిరుపతిలో హైటెన్షన్..భూమన హౌస్ అరెస్ట్ !

Read Time:  1 min
High tension in Tirupati.. Bhumana under house arrest!
High tension in Tirupati.. Bhumana under house arrest!
FONT SIZE
GET APP

Bhumana Karunakar : తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర సవాళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీంతో భూమన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తిరుమల గోశాలలో వందల ఆవులు మరణించాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ ఆరోపించారు.

తిరుపతిలో హైటెన్షన్ భూమన హౌస్

ర్యాలీగా వెళ్లవద్దు.. గన్‌మెన్‌లతో మాత్రమే సందర్శించాలి

ఇది అసత్య ప్రచారమని, ఆధారాలు బయటపెట్టాలని టీటీడీ సవాల్ చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ తిరుమల గోశాల శాంతిర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ర్యాలీకి అనుమతి లేదని తిరుపతి పోలీసులు తెలిపారు. ర్యాలీగా వెళ్లవద్దని గన్‌మెన్‌లతో మాత్రమే సందర్శించాలని భూమనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల భారీగా మోహరించారు. అయితే భూమన హౌస్ అరెస్ట్ చేశారని పలువురు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

తిరుమల తిరుపతి లో ఎటు చూసిన టెన్షన్ వాతావరణం

ఈ ప్రచారంపై స్పందించిన పోలీసులు తాము ఎవరినీ హౌస్ అరెస్ట్ చేయలేదని తేల్చి చెప్పారు. దీంతో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హౌస్ అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని టీడీపీ విమర్శించారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక నగరం అయిన తిరుమల తిరుపతి లో ఎటు చూసిన టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ రోజు కూటమి నేతలు టీటీడీకి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించాలని పిలుపు నిచ్చారు.

Read Also: టీడీపీ ఛాలెంజ్ స్వీకరించిన భూమన

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.