విజయవాడ : సివిల్ వివాదం కేసు రాజీ చేసుకోవాలని పోలీసులు వేధించడంపై హైకోర్టు (High Court) అసహనం వ్యక్తం చేసింది. బెదిరించి కేసును రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేయడం ఏమిటని ప్రశ్నించింది. పోలీసులు ఏం చేస్తున్నారో కోర్టుకు తెలియదని అనుకోవద్దని చెప్పింది. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయకుండా తీరుబడిగా మీకు ఇష్టం వచ్చినప్పుడు నమోదు చేయడం ఏమిటని నిలదీసింది. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
పిటిషనర్ పఠాన్ కరీంసా వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని, జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల ఎస్ఎహెచ్కను హెచ్చరించింది. పోలీసుల నిర్బంధంలో ఉన్న వైసిపి కార్యకర్త పఠాన్ కరీంసా కోర్టులో హాజరైన విషయాన్ని రికార్డుల్లో నమోదు చేసింది. ఆయన భార్య పఠాన్ సైదా బీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను మూసేస్తున్నట్లు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ జగడం సుమతి డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తన భర్తను పోలీసులు నిర్బంధించి కోర్టులో హాజరుపర్చలేదంటూ సైదా బీ పిటిషన్ వేశారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు (Police) పఠాన్ కరీంసాను హైకోర్టులో హాజరుపర్చారు.
కరీంసా తరఫు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి వాదిస్తూ, పిటిషనర్ సివిల్ వివాదంలో పిడుగురాళ్ల ఎస్ హెచ్ జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. కరీంసా కల్పించుకుని ఎస్ హెచ్ఓ వ్యవహరిస్తున్నారని చెప్పారు. దీంతో హైకోర్టు పోలీసుల తీరును తప్పుపట్టింది. సివిల్ వివాదాల్లో పోలీసులు అత్యుత్సాహం చూపడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Skill Development : ఉపాధి నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణపై దృష్టి